హైదరాబాద్

నేడు ‘మహా కౌన్సిల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: మహానగర పాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం పది గంటలకు మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ప్రారంభం కానుంది. జిహెచ్‌ఎంసి పరిపాలన, నగరంలో చేపట్టే అభివృద్ధిలోనూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు వార్డు కమిటీల నియామకంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే 150 వార్డు కమిటీలకు అందిన నామినేషన్లను పరిశీలించి, వాటిలో ఆమోదయోగ్యమైన కమిటీల నామినేషన్లకు నేటి కౌన్సిల్ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. దీంతో పాటు నగరంలో వౌలిక వసతుల పరంగా నెలకొన్న సమస్యలు, ఇదివరకు స్థారుూ సంఘం ఆమోదించిన పలు ముఖ్యమైన ప్రతిపాదనలు ఈ సమావేశంలో ప్రస్తావనకొచ్చే అవకాశముంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 5643 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు శుక్రవారం స్థారుూ సంఘం ఆమోదం తెలిపినా, శనివారం నాటి కౌన్సిల్ సమావేశంలో కొందరు సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు. ప్రత్యేకించి బడ్జెట్‌పై ప్రత్యేకంగా కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాల్సి ఉన్నా, శుక్రవారం నాటి స్థారుూ సంఘం సమావేశం ఆమోదం తెలిపినా, స్వల్పంగానైనా చర్చ అనివార్యమయ్యేలా ఉంది. వార్డు కమిటీలకు సంబంధించి ఇప్పటికే అధికార టిఆర్‌ఎస్, మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీల నుంచి వేల సంఖ్యలో నామినేషన్లు అందటంతో ఏ ఏ డివిజన్‌లో ఏ కమిటీని నియమించాలి? అందులో సభ్యులు కాలపరిమితి ఎంత వరకు నిర్ణయించాలన్న అంశంపై నెలకొన్న ఉత్కంఠకు ఈ కౌన్సిల్ సమావేశం తెర దింపే అవకాశముంది.
ముఖ్యంగా వార్డు కమిటీ సభ్యులు సైతం తమ మాదిరిగానే అయిదేళ్ల పాటు పదవిలో కొనసాగకుండా కాలపరిమితి తగ్గించాలని ఇదివరకు జరిగిన పలు స్థారుూ సంఘం సమావేశాలు, ఇతర సందర్భాల్లో కొందరు కార్పొరేటర్లు మేయర్ బొంతు రామ్మోహన్‌కు వినతులు సమర్పించారు. అంతేగాక, ఏకంగా అయిదేళ్ల పాటు ఒకరికే అవకాశమివ్వకుండా, వార్డు కమిటీ సభ్యులు పదవీకాలాన్ని ఏడాదిగా నిర్ణయిస్తే ఇతరులు కూడా భాగస్వాములయ్యే అవకాశముంటుందని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కౌన్సిల్‌లో అధికంగా బలమున్న టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీల నుంచి వచ్చిన నామినేషన్లలో సర్దుబాటు కుదిరినందునే, కమిటీలకు ఆమోదం తెలిపేందుకు శనివారం కౌన్సిల్ సమావేశమవుతున్నట్లు సమాచారం.