హైదరాబాద్

కరెన్సీ కష్టాలకు ఆర్‌బిఐ, కేంద్ర ప్రభుత్వమే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: ప్రత్యామ్నాయ చర్యలు, ముందు చూపు లేకుండా ఉన్నఫలంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయటం వల్లనే ప్రజలు కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ ఆసోసియేషన్ ఆరోపించింది. 86 శాతం చెలామణిలో ఉన్న పెద్దనోట్నను రద్దు చేసే ముందు ప్రత్యామ్నాయ కరెన్సీ ముద్రించకపోవటం ఆర్‌బిఐ, కేంద్ర ప్రభుత్వాల తప్పిదమే కారణమని పేర్కొంది. ఈనెల 16 నుంచి నాలుగు రోజుల పాటు నగరంలోని ఆర్టీసి కళా నిలయంలో జరుగన్నున 7వ వార్షిక మహాసభల వాల్‌పోస్టర్‌ను ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.నాగరాజన్ ముఖ్యఅతిథిగా హజరై ప్రారంభించారు. నోట్ల రద్దుతో ఖాతాదారులకు నగదు చెల్లంపులకు దాదాపు రూ.10 కోట్లు చెల్లించాలనుకుంటే కేవలం ఒక కోటి మాత్రమే అందుబాటులో ఉందనీ దీని వల్ల ఉద్యోగులు రోజుకు దాదాపు 14 గంటలు పని చేయాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1లక్షా 50 వేల కోట్టు తక్షణం కొత్త రూ.500, వంద నోట్లు అవసరమని స్పష్టం చేశారు.
ప్రజలెదుర్కుటున్న కష్టాలను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లదనం బయటకి రాదని తేల్చి చెప్పారు. ఇతర దేశాలలోనున్న నల్లధనం వెనక్కి తెప్పిస్తే ఈనోట్ల రద్దు అవసరం ఉండేదికాదని అన్నారు. ప్రధఆని ఎన్నికల హామీ ప్రకారం నల్లదనం వెనక్కి తెప్పించలేక తన ఉనికి చాటుకోవటానికి మాత్రమే రద్దు చేశారని బావిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలెదుర్కుంటున్న కష్టాలకు బ్యాంకర్లే కారణమని చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకో 25 ఏళ్లైనా దేశం క్యాష్‌లెస్ సొసైటీగా మారదని ఓప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కార్యక్రమంలో ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ ఆసోసియేషన్ ప్రతినిధులు అలోక్ అరా, వి.అనీల్‌కుమార్, సి.రవిచంద్ర, హరినాథ్, రాజేంధ్రప్రసాద్, ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

గానగంధర్వుడు ఘంటసాల
కాచిగూడ, డిసెంబర్ 2: ఘంటసాల 94వ జయంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త మంగళగిరి ఆదిత్య ప్రసాద్‌చే ‘వివిధ గాయనీమణులతో మాష్టారు’ అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం వంశీ ఇంటర్నేషనల్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలోని కళాలలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ కవి జాతీయ అవార్డు గ్రహీత డా.సుద్దాల అశోక్‌తేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఘంటసాల ఎంతోమంది గాయకులను చేరదీసి ప్రోత్సహించారని తెలిపారు. ఘంటసాల రచించిన పాటలు నేటికీ ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలచిపొయయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈలపాట శివప్రసాద్, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు, గానసభ అధ్యక్షుడు డా.కళావేంకట దీక్షితులు, తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.