హైదరాబాద్

బడ్జెట్‌కు ‘స్థారుూ’ సంఘం ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: మహానగరంలో కోటి మంది జనాభాకు పౌరసేవలు, అత్యవసర సర్వీసులను అందించే జిహెచ్‌ఎంసి రానున్న ఆర్థిక సంవత్సరం(2017-18)కి రూపొందించిన బడ్జెట్‌కు స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన శుక్రవారం ప్రధాన కార్యాలయంలో జరిగిన స్థారుూ సంఘం సమావేశంలో రూ. 5643 కోట్లతో అధికారులు రూపొందించిన బడ్జెట్ ముసాయిదాపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. అధికారులు రూపొందించిన బడ్జెట్‌ను మరో రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు పెంచుకుంటే బాగుంటుందంటూ సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ వర్తమాన ఆర్థిక సంవత్సరం (2016-17)కు సంబంధించిన రూ. 5061.74 కోట్ల బడ్జెట్‌కు కేవలం రూ. 43 కోట్లను పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం విజన్ మేరకు మున్ముందు నగరంలో వౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూపొందించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి), పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి ముఖ్యమైన పథకాలను అమలు చేయాల్సి ఉన్నందున, వర్తమాన ఆర్థిక సంవత్సరం కన్నా స్వల్పంగా పెంచి రూపొందించిన ఈ బడ్జెటే జిహెచ్‌ఎంసికి అనుకూలంగా ఉంటుందని స్థారుూ సంఘం తీర్మానించింది. ఈ ముసాయిదాను త్వరలోనే కౌన్సిల్‌లో ప్రవేశపెట్టి, మరో సారి సభ్యులు అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత సర్వసభ్య సమావేశం ఆమోదించిన తర్వాత సర్కారుకు పంపనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డిపితో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్లకు పెట్టుబడుల వ్యయంలో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. దీంతో పాటు మురికివాడల్లో వౌలిక వసతుల కల్పన, పేదవారికి జిరో వడ్డీకి రుణాలు అందించేందుకు వీలుగా బడ్జెట్ రూప కల్పన చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డిలు వెల్లడించారు.
ప్రతిపాదిత బడ్జెట్ స్వరూపం
* మొత్తం బడ్జెట్ రూ. 5643 కోట్లు
* రెవెన్యూ ఆదాయం(ట్యాక్సు రెవెన్యూ, అసైన్డ్ రెవెన్యూ, ఫీజులు, యూజర్ ఛార్జీలు, సేల్స్, అద్దెలు, రెవెన్యూ గ్రాంట్లు, ఇతర ఆదాయ మార్గాలతో కలిపి) రూ. 2926 కోట్లు
* రెవెన్యూ వ్యయం (వ్యవస్థాపరమైన ఖర్చులు, పరిపాలనపరమైన వ్యయం, ఆపరేషనల్, మెయింటనెన్స్, వడ్డీ, ఫైనాన్స్ ఛార్జీలు, ఇతర కార్యక్రమ ఛార్జీలు) రూ. 2616.27 కోట్లు
* రెవెన్యూ మిగులు(రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ వ్యయం) రూ. 310.55 కోట్లు
* పెట్టుబడుల స్వీకరణ(రెవెన్యూ బదిలీ, ప్లాన్ గ్రాంట్లు, రెగ్యులరైజేషన్ ఫీజులు, రుణాలు ఇతరత్ర) 3026.73 కోట్లు
* పెట్టుబడుల వ్యయం(్భములు, భూముల అభివృద్ది, బిల్డింగ్‌లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, సబ్‌వేలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు, వాటర్ సప్లై, సీవరేజ్, వరద నీటి కాలువలు, వీది ధీపాలు, ఇతర పనులు, యంత్రాలు, వాహనాలు, స్లమ్ డెవలప్‌మెంట్) 3026.73కోట్లు

మూడేళ్ల బడ్జెట్ (రూ.కోట్లలో)
అంశం 2016-17-2017-18
రెవెన్యూ ఆదాయం 2723.24 2926.82
రెవెన్యూ వ్యయం 2586.45 2616.27
రెవెన్యూ మిగులు 136.79 310.55
పెట్టుబడుల స్వీకరణ 2475.29 3026.73
పెట్టుబడుల వ్యయం 2475.29 3026.73
మొత్తం బడ్జెట్ 5071.74 5643.00.