హైదరాబాద్

6న పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకంలో భాగంగా కోదండపూర్‌లోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో చేపడుతున్న మరమ్మతుల పనుల కారణంగా ఈనెల 6వ తేదీ ఉదయం ఆరు నుంచి మరుసటి రోజు 7వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు 24 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి ట్రాన్స్‌మీషన్ అధికారులు తెలిపారు. కొండాపూర్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు సంబంధించిన రా వాటర్ కనెక్షన్‌ను కలిపేందుకు సంబంధించిన పనులు కారణంగా జలమండలి ట్రాన్స్‌మిషన్ విభాగం ఆధ్వర్యంలో పలు మరమ్మతుల పనులను చేపడుతున్నారు. దీంతో ఈనెల 6వ తేన నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ముందు జాగ్రత్తగా నీటి సరఫరా ఉండని ప్రాంతాల వినియోగదారులు ముందుగానే నీటిని నిలువ చేసుకుని పొదుపుగా వాడాలని జలమండలి సూచించింది.
* నీటి సరఫరా ఉండని ప్రాంతాలు: మీరాలం, మిష్రిగంజ్, జాహనూమ, వట్టెపల్లి, అలియాబాద్ రిజర్వాయర్ పరిధిలోని అన్ని ప్రాంతాలు, సంతోష్‌నగర్, వినాయక్‌నగర్, వైశాలినగర్, చెంచల్‌గూడ, యాకుత్‌పురా, మలక్‌పేట్, అస్మాన్‌ఘడ్, ముసారాంబాగ్ పార్ట్ ఆఫ్ దిల్‌సుఖ్‌నగర్, సైదాబాద్, నారాయణగూడ, బొగ్గులకుంట, శివం, అడిక్‌మెట్, చిలకల్‌గూడ, బాగ్‌లింగంపల్లి, అంబర్‌పేట్, రామంతపూర్ తదితర ప్రాంతాలు.

త్వరలోనే ఏరియా కమిటీల నియామకం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 3: నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు గాను త్వరలోనే ఏరియా కమిటీలను కూడా నియమించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ శనివారం చేపట్టిన వార్డుల కమిటీ ఎన్నిక పారదర్శకంగా పూర్తయిందని వివరించారు. కేవలం నాలుగు డివిజన్లలో మాత్రమే సాంకేతిక కారణాల వల్ల ఎన్నిక జరగలేదని స్పష్టం చేశారు. ప్రతివార్డులో 50 శాతం మంది మహిళలను సభ్యులుగా నియమించామని మేయర్ అన్నారు. హైదరాబాద్ నగర చరిత్రలో వార్డు కమిటీలలో ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు నియమించటం ఇదే మొదటి సారి అని ఆయన పేర్కొన్నారు. వార్డు కమిటీల్లో సభ్యులుగా నియమించేందుకు అభివృద్ధి కాముకులు, స్వతంత్య్రులను ఏంపిక చేసే ప్రతిపాదనలను సిద్దం చేయటంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ రెండురోజులుగా ఎంతో శ్రమించారని ఆయన్ను భినందించారు. కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో సహకరించారని ఆయన వెల్లడించారు. త్వరలోనే ఈ వార్డు కమిటీ సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించటం జరుగుతుందని అన్నారు.

గంజాయి విక్రేతకు
పదేళ్ల జైలు శిక్ష
ఉప్పల్, డిసెంబర్ 3: నిబంధనలు ఉల్లంఘించి గంజాయిని విక్రయిస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగారా శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానాను విధిస్తూ రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటిన్ సెషన్ జడ్జి కె.సునీత శనివారం సంచలన తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించని ఎడల మరో ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..రామంతాపూర్ సత్యనగర్‌లో నివసిస్తున్న రాజస్థాన్‌కు చెందిన పుక్‌రాజ్ రాజ్‌పురోహిత్ అలియాస్ సుఖ్‌రాజ్ అలియాస్ రజాక్ (42) గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. జీవనోపాది కోసం 1997లో హైదరాబాద్‌కు వచ్చిన అతడు హోటల్‌లో పని చేస్తూ 1999లో ముస్లీం యువతి బెప్సా బేగంను పెళ్లి చేసుకున్నాడు. పని చేతగాక తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దుర్భుద్దితో గంజాయి వ్యాపారం చేయడం ప్రారంభించాడు, గంజాయిని విక్రయిస్తూ 2008లో జీడిమెట్లలో పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన రాజ్‌పురోహిత్ అంబర్‌పేట్ టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు తిరిగి పోలీసుల కళ్లు గప్పి అనుమానం రాకుండా సూట్‌కేసులలో పెట్టుకుని రైలులో ప్రయాణం చేసి విశాఖపట్నంలో దిగి స్విప్ట్ కారులో రామంతాపూర్‌కు వచ్చి విక్రయిస్తుండగా 2014లో ఉప్పల్ పోలీసులు అందిన సమాచారం మేరకు చాకచక్యంగా పట్టుకున్నారు. అతని వద్ద అప్పట్లో 10 బ్యాగులు గంజాయ్, ఆరు సూట్‌కేసులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టుకు రిమాండ్ చేశారు. ఇన్‌స్పెక్టర్ వై.నర్సింహారెడ్డి కేసు దర్యాప్తు చేసి కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేయగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట్‌రెడ్డి ప్రాసిక్యూషన్ నిర్వహించగా జడ్జి సునీత గంజాయి విక్రేత రాజ్‌పురోహిత్‌కు పై శిక్షను విధిస్తూ తీర్పు చెప్పారు.

జూనియర్ ఆర్టిస్టులను దోచుకున్న ముఠా అరెస్టు

బాలానగర్, డిసెంబర్ 3: ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులను బెదిరించి వారి వద్దనున్న నగదు, నగలను దోచుకున్న ముఠా సభ్యులను శనివారం బాలానగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలానగర్‌లోని ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసిపి నంద్యాల నర్సింహారెడ్డి వివరాలను వెల్లడించారు. షేక్ మణికొండకు చెందిన నంజూ ధనశ్రీ, నంజూ శ్రీలత అక్కా చెల్లెళ్లు, గత నెల 28న రాత్రి బేగంపేటలోని పర్సుల్ పబ్‌కు వెళ్ళి తిరిగి వస్తున్నారు. యూసుఫ్‌గూడకు చేరుకోగానే ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. వీరితో పాటు పబ్బులో ఉన్న ఏడుగురు వ్యక్తులు సహయం చేశారు. గాయాలకు గురికావడంతో ఇంటి వద్ద దింపుతామని నమ్మబలికారు. దీంతో వారిద్దరూ వారితో పాటు వెళ్ళారు. వాహనాన్ని బాలానగర్ తీసుకెళ్ళి అలహబాద్ సందులోకి తీసుకెళ్ళి వాహనాన్ని అపి వారిపై దాడి చేసి వారి వద్ద నున్న నగదు, సెల్‌ఫోన్‌తో పాటు బంగారు అభరణాలను దొచుకెళ్ళారు. దీంతో