హైదరాబాద్

ఏక పక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: మహానగర పాలక సంస్థ పౌరసేవల నిర్వహణ, నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఎట్టకేలకు వార్డు కమిటీలకు జిహెచ్‌ఎంసి పాలక వర్గం శనివారం ఎన్నిక నిర్వహించింది. ఉదయం పది గంటలకు ప్రత్యేకంగా సమావేశం కావల్సిన కౌన్సిల్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైనా, ఎట్టకేలకు వార్డు కమిటీ నియామకం కోసం వచ్చిన నామినేషన్లలో అర్హత కలిగిన వాటిని నామినేటెడ్ ప్రాతిపదికన ఆమోదించింది. ఇందులో మహిళా రిజర్వేషన్ల ప్రకారం యాభై శాతం సభ్యత్వాలు మహిళలకు కేటాయించారు. 13 డివిజన్లలో మహిళల నుంచి నామినేషన్లు రాకపోవటంతో వచ్చిన వాటిని ఎంపిక చేసుకుని, మళ్లీ నామినేషన్లు స్వీకరించి, ఎన్నిక నిర్వహించనున్నట్లు మేయర్ తెలిపారు. ఉదయం పది గంటలకు ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన అన్ని పార్టీల కార్పొరేటర్లు హడావుడిగా చేరుకున్నారు. విపక్షాలైన కాంగ్రెస్, బిజెపిలతో సహా అధికారపార్టీ, మజ్లిస్ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ప్రతిపాదించిన పేర్లు సైతం కన్పించకపోవటంతో వారు ఆందోళనకు గురయ్యారు.
సమావేశానికి తాము హాజరయ్యే ప్రసక్తేలేదని దాదాపు అన్ని పార్టీల కార్పొరేటర్లు తేల్చి చెప్పటంతో మేయర్ బొంతు రామ్మోహన్ తన ఛాంబర్‌లో వారితో చర్చలు ప్రారంభించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ సర్దుబాటు చర్చలు కొనసాగాయి. చాలా డివిజన్లలో కార్పొరేటర్లు ప్రతిపాదించిన పేర్లు గల్లంతై ఎమ్మెల్యేలు సూచించిన పేర్లు తెరపైకి రావటంతో కార్పొరేటర్లు మండిపడినట్లు సమాచారం. మరికొన్ని ప్రాంతాల్లోన్ని ఇటీవలే ఇతర పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వార్డుల కమిటీ నియామకానికి ప్రధానంగా ఇలాంటి సమస్య తలెత్తినట్లు తెలిసింది. ఇక అన్ని డివిజన్లలోనూ వార్డు కమిటీ సభ్యుల నియామకానికి సంబంధించి ఎమ్మెల్యే, వర్సెస్ కార్పొరేటర్ వివాదం కొనసాగింది. సుమారు మూడు గంటల పాటు మేయర్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో చర్చలు జరిపిన తర్వాత ఒంటి గంటకు సమావేశం ప్రారంభమైంది. మొత్తం 150 డివిజన్లలో ఒక్కో డివిజన్‌లో పది మందితో ఏర్పాటు చేయాల్సిన వార్డు కమిటీల్లో సభ్యత్వం కోసం గ్రేటర్‌కు మొత్తం 4520 నామినేషన్లు అందగా, వాటిలో 3155 నామినేషన్లను అర్హత కల్గినవిగా అధికారులు గుర్తించారు. వీటిలో మొత్తం 1500తో 150 వార్డు కమిటీలను ఎన్నుకోవల్సి ఉండగా, 67 సభ్యత్వాలు మినహా మిగితా నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులను వార్డు కమిటీలకు ఎన్నుకున్నట్లు, అందుకు కౌన్సిల్ ఆమోదం వేస్తున్నట్లు మేయర్ తెలిపారు.
ఎన్నిక జరిగిందిలా...
స్థారుూ సంఘంలోని 15 మంది సభ్యులు ఒక్కోక్కరు పది డివిజన్లకు సంబంధించిన వార్డు కమిటీ సభ్యుల పేర్లను సభలో ప్రతిపాదించారు. ఒక్కో వార్డుకు పది పేర్లు చొప్పున ప్రతిపాదించిన తర్వాత వాటన్నింటిని ఆమోదిస్తున్నట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు. ఈ రకంగా సభ్యులు ప్రతిపాదించిన 1433 మంది వార్డు కమిటీ సభ్యుల పేర్లను శనివారం జరిగిన కౌన్సిల్ ఆమోదించింది. మిగిలిన 63 సభ్యుల్లో నాలుగు డివిజన్లకు చెందిన 40 మంది ఎన్నిక వాయిదా పడగా, మరో 13 వార్డుల్లోని 27 సభ్యుల నియామకం కోసం మహిళల నుంచి నామినేషన్లు అందకపోవటంతో, నామినేషన్ల స్వీకరణ మళ్లీ చేపట్టిన తర్వాతే ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటిస్తూ సభ్యులు ప్రతిపాదించిన పేర్లను కౌన్సిల్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన మేయర్ రామ్మోహన్ కౌన్సిల్ సమావేశాన్ని ముగించారు.