హైదరాబాద్

వరుస సెలవులు.. తప్పని కరెన్సీ కష్టాలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు వరుస సెలవులు తోడయ్యాయి. దీంతో ఖాతాదారుల పరిస్థితి పుండు మీద కారం చల్లిన విధంగా తయారయ్యింది. నెలరోజుల పాటు నగదు కోసం అష్టకష్టాలు పడ్డ నగరవాసుల్లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఓపిక నశించి ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. రెండో శనివారం తోపాటు వరుసగా ఆదివారం , సోమవారం మిలాద్-ఉన్-నబి సెలవుకావటంతో ఖాతాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే నోక్యాష్, అవుట్ ఆఫ్ సర్వీస్‌లతో వెక్కిరిస్తున్న ఏటిఎంలకు తోడు బ్యాంకులకు సెలవులు రావటంతో అరకొరా లభ్యమవుతున్న రెండు, మూడు వేలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పటికే చిన్నా భిన్నమైన ఆర్థిక వ్యవస్థలో బతుకులీడుస్తున్న సామాన్య మధ్య తరగతి ప్రజానీకంతో పాటు నగరంలో వీకెండ్ సందడి కరవయ్యింది. పర్యాటక ప్రదేశాలు జనం లేకపోవడంతో వెలవెలబోయాయి. ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాలు ఖాతాల్లో జమ అయినా, అవసరాలకు తగిన విధంగా డ్రా చేసుకోలేని దుస్థితి నెలకొంది. దైనందన జీవితంలోప్రతి నెల తొలి వారంలో నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు, ఇంటి అద్దెలు, స్కూల్, కాలేజీల ఫీజులు, ఇతర సర్దుబాట్లు నిమిత్తం వంటివి చెల్లించాల్సి ఉండటంతో జీతం మొత్తం డ్రా చేసుకునేందుకు బ్యాంకు వెళ్లే ఖాతాదారులకు కొన్ని బ్యాంకులు రూ.4వేలు, మరికొన్ని బ్యాంకులు రూ.6 నుంచి రూ.10వేల వరకు మాత్రమే నగదు ఇస్తున్నాయి. అది కొంత మందికి మాత్రమే పరిమితమవుతోంది. పగలంతా ఉద్యోగాలు చేసుకోవటం, రాత్రంతా ఏటిఎంల వద్ద క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. దీంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుఝమునే బ్యాంకుల ముందు బారులు తీరినా, నగదు అందుతుందో లేదోనన్న ఆందోళన ఖాతాదారులలో నేటికీ నెలకొంది. వరుసగా మూడ్రోజులు సెలవులు రావటంతో శుక్రవారం ఉదయం నుండే ప్రజలు బ్యాంకులు, ఏటిఎంల ముందు జనం కిక్కిరిసిపోయారు. చాలా వరకు ఏటిఎంల వద్ద అర్ధరాత్రి వరకూ చలిని లెక్కచేయకుండా ఖాతాదారులు డబ్బు కోసం క్యూ కట్టడం కన్పించింది. తప్పనిసరి పరిస్థితుల్లో సౌకర్యం ఉన్నవారు మాత్రం పిఓఎస్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ ద్వారా వీలైనంతవరకు లావాదీవీలు కొనసాగిస్తున్నా నిరుపేద మధ్యతరగతి, సామాన్య ప్రజలకు మాత్రం కరెన్సీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నగరంలో ఎక్కడ చూసినా..ఎవరి నోట విన్నా చిల్లర సమస్యలే వినిపిస్తున్నాయి.