హైదరాబాద్

ముమ్మరం కానున్న ‘స్వచ్ఛ’ ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: స్వచ్ఛ్భారత్ మిషన్ జాతీయ స్థాయిలో నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేపై జిహెచ్‌ఎంసి పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే స్వీపర్ మొదలుకుని కార్పొరేట్ సంస్థల వరకు ప్రతి ఒక్కర్నీ ఇందులో భాగస్వాములను చేసేందుకు సిద్దమైంది. ఇందుకోసం ఇటీవలే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి స్వయంగా రూపొందించిన ‘కుటుంబంగా కలిసి ఉందా..చెత్తను విడదీద్దాం..! అన్న నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్దమైంది. అయితే కుటుంబానికి చెత్తకు ఏం సంబంధం.. రెండింటిని పోల్చి చూడటంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ నూతన నినాదంలో విస్త్రృతస్థాయి సందేశం దాగి ఉందని, ప్రస్తుత సమాజంలో ఇది ప్రతి వారిలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారుతోందని కమిషనర్ జనార్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్లోబలైజేషన్ సమాజంలో విభిన్న రంగాలతో పాటు కుటుంబ వ్యవస్థలోనూ తీవ్రమార్పులకు కారణమైన సంగతి తెలిసిందే! నేటికీ కొందరు విదేశాల్లోని బహుళ జాతి కంపెనీల్లో కార్పొరేట్ విధుల్లో నిమగ్నమై స్వదేశంలో ఉన్న కన్నవారిని కూడా పట్టించుకోని వారికి కుటుంబంలా కలిసుందాం అన్న నినాదం కాస్త కనువిప్పు కల్గిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలను ఇందులోని కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణలోనే ప్రత్యేక గుంతలను ఏర్పాటు చేసిన సేంద్రీయ ఎరువులను తయారు చేసి, పంట పొలాలకు, ఇంట్లోని పెరటితోటలకు వినియోగించుకోవచ్చుని అధికారులు సూచించారు. ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా పెరగటంతో అధిక శాతం ఇళ్లు ఈరకమైన విధానానికి స్వస్తిపలికాయి. దీంతో ప్లాస్టిక్ అటు భూమిలో కలవకుండా పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. ఇదే పరిస్థితిని నేటి కుటుంబ వ్యవస్థ కూడ ఎదుర్కొంటుంది. ప్రస్తుత సాంకేతిక యుగంలో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావటం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దూరమైన, ఒంటరి జీవితాలు అధికమైన నేటి తరుణంలో చెత్తను తడి,పొడి చెత్తగా వేరు చేసేందుకు ఇచ్చే నినాదం కొంతవరకైనా కదిలించకపోతుందా? అని జిహెచ్‌ఎంసి అధికారులు భావిస్తున్నారు.
కలిసుంటేనే కలదు సుఃఖం
కాలక్రమేనా ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ కుటుంబ వ్యవస్థ రోజురోజుకి దెబ్బతింటోంది. బెల్జియంలో అత్యధికంగా 71.2 శాతం, పోర్చుగల్‌లో 68శాతం, అంగరిలో 67, స్పెయిన్‌లో 61, ఫ్రాన్స్‌లో 56శాతం, అమెరికాలో 53శాతం, బ్రిటన్‌లో 47, ఆస్ట్రేలియాలో 43 శాతం కుటుంబాలు పలు కారణాలతో విడిపోతున్నట్లు తాజాగా అధ్యయనాలు చెబుతున్నాయి. మన దేశంలోనూ ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్న సందర్భాలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కలిసుంటేనే కలదు సుఃఖం అన్న సామెత జిహెచ్‌ఎంసి చెత్తను వేరు చేసేందు ఇచ్చిద నినాదం నిజం చేయనుంది. విడిపోయిన కుటుంబ సభ్యులకు పలు సమస్యలు ఎదురైనపుడు ఎదుర్కొనే మానసిక పరిస్థితులు. సహాయానికి ఎవరూ లేకపోవటం వంటి పరిణామాలేర్పడుతాయి. ఈ పరిస్థితులను పారిశుద్ద్య కార్మికులకు అనువదిస్తూ కుటుంబ సభఉయలుగా కలిసి ఉందా..చెత్తను తడి,పొడి చెత్తగా విడదీద్దాం.. అనే నినాదం జిహెచ్‌ఎంసి

అర్థరాత్రి నుంచే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు

హైదరాబాద్, డిసెంబర్ 24: క్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకుని ఆదివారం నగరం హ్యాప్పీ క్రిస్మస్‌ను జరుపుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే శనివారం అర్థరాత్రి నుంచి పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ముఖ్యంగా సికిందరాబాద్ ఎస్‌డి రోడ్డులోని రెండు చర్చిల్లో, అలాగే క్లాక్ టవర్ ముందున్న చర్చిలో రాత్రి పదకొండు గంటల నుంచే అత్యధిక సంఖ్యలో క్రైస్తవులు హాజరయ్యారు. ఆబిడ్స్‌లోని మెథడిస్టు, నారాయణగూడ, మాసాబ్‌ట్యాంక్‌లోని రాక్‌చర్చితో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని చర్చిలు క్రిస్మస్ సంబరాలకు ముస్తాబయ్యాయి. విద్యుత్ కాంతులతో ధగధగలాడాయి. శనివారం సరిగ్గా అర్థరాత్రి పనె్నండు గంటల సమయంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మరికొన్ని చర్చిల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి అత్యధిక సంఖ్యలో హాజరయ్యే క్రైస్తవులు సామూహిక ప్రార్థనలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.
మేడ్చల్: నేడు (ఆదివారం) క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పట్టణంలోని పలు చర్చిలతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలోని చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. చర్చిలను గోపురాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. క్రైస్తవ సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదిన వేడుకల సందర్భంగా ఆయా చర్చిలలో ప్రత్యేక సామూహిక ప్రార్ధనల కోసం అంతా సిద్ధం చేశారు. శాంతిదూత కరుణామయుడు ఏసుక్రీస్తు పుట్టిన రోజును పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేలా క్రైస్తవులు అన్ని విధాలుగా సంసిద్ధులయ్యారు. కాగా పెద్ద నోట్ల రద్దు ప్రభావం క్రిస్మస్ పండుగపై భారీగానే పడిందని చెప్పవచ్చు. నిరుపేద క్రైస్తవులు క్రిస్మస్ పర్వదినాన్ని చాలా సాదాసీదాగా జరుపుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా వారు పండుగను ఘనంగా జరుకునే వీలు లేకుండా పోయింది. ఆర్ధికంగా మెరుగ్గా ఉన్న వారు పండుగ పర్వదినాన్ని ఆస్వాదించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఆయా చర్చిలలో ఏసు ప్రభువు జీవిత విశేషాలను ధ్రువీకరించే విధంగా క్రిబ్‌లను ప్రత్యేక రంగురంగుల దీపాలతో తీర్చిదిద్దారు. పెద్ద మొత్తంలో క్రిస్మస్ పర్వదిన ప్రార్ధనలకు క్రైస్తవులు హజరుకానుండటంతో ఆయా చర్చిలలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ప్రధానంగా క్రైస్తవుల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో గ్రామాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మండలంలోని ఙ్ఞణపూర్, బాసురేగడి గ్రామాలలోని చర్చిలను ప్రార్ధనల కోసం ప్రత్యేకంగా ముస్తాబు చేయడంతో పాటు అన్ని సౌకర్యాలను నిర్వాహకులు సమకూర్చారు. వందలాదిగా క్రైస్తవులు ప్రార్ధనలకు తరలి రానుండటంతో అందుకు తగ్గటుగా ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. చాలా చర్చిలలో భక్తుల సౌకార్యర్ధం ప్రత్యేక షామియానాలను ఏర్పాటు చేశారు. నీటి వసతి కూడా కల్పించారు. ఆయా చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనల అనంతరం స్పెషల్ కేక్‌లను కట్ చేయడం కోసం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కింగ్‌టెంపుల్ చర్చి క్రిస్మస్ వేడుకల సందర్భంగా భారీ ఏర్పాట్లను చేశారు. వందల సంఖ్యలో క్రైస్తవులు ప్రార్ధనల కోసం తరలిరానుండటంతో నిర్వాహకులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. దీంతో పట్టణంలోని అన్ని చర్చిలు క్రిస్మస్ సంబరాలకు ముస్తాబై వేడుకలకు సిద్ధమయ్యాయి.
వికారాబాద్: క్రిస్మస్ పండుగ సందర్భంగా పట్టణంతో పాటు పరిసర గ్రామాల చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. ఆదివారం క్రిస్మస్ ఉండటంతో క్రైస్తవులు ఇళ్ళ వద్ద నక్షత్రాలు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించుకున్నారు. శనివారం పండుగకు అవసరమైన కొనుగోళ్ళతో క్రైస్తవులు బిజీబిజీగా కనిపించారు. ఈసందర్భంగా హిందువులు, ముస్లింలు క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
చేవెళ్ల: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చేవెళ్లతో పాటు మండల కేంద్రంలో పలు చర్చిలు అందగా ముస్తాబు అయ్యాయి. డిసెంబర్ 25న ప్రతి సంవత్సరం జరిగే క్రిస్మస్ వేడుకలు ఈసారి కూడా ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, ప్రత్యేకంగా క్రైస్తవ సోదరులకు బట్టల పంపిణీ, క్రిస్మస్ విందు వేడుకలు ముందే ఘనంగా నిర్వహించారు. చేవెళ్ల మండలంలో అధికారులు చర్చి పాస్టర్లతో చర్చించి పండుగకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే ఘనంగా నిర్వహించగా నేడు జరుగబోయే క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. క్రైస్తవులు ఇళ్ల వద్ద స్టార్‌లు, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేసుకున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బేకరీ నిర్వాహకులు ప్రత్యేక ఆకర్షణగా కేక్‌లను తయారు చేశారు. అలాగే చేవెళ్లలోని రంగారెడ్డి, గణేష్, ఎస్సీ తదితర కాలనీల్లోని చర్చిలు పండుగకు ముస్తాబు అయ్యాయి.