హైదరాబాద్

చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: హెరిటెజ్ సిటీగా పేరున్న హైదరాబాద్ నగంలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రత్యేకంగా కృషి చేయాలని ఆర్కియాలజీ డైరెక్టర్ విశాలాక్షి అన్నారు. షేక్‌పేట సమీపంలోని సెవెన్ టూంబ్స్‌లో మంగళవారం ఆరుబయట నిర్వహించిన జిహెచ్‌ఎంసి సమీక్షా సమావేశానికి ఆమె ప్రత్యేకంగా హజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌లోని అనేక పురాతన ప్రాంతాలకు వేల సంఖ్యలో విదేశీ పర్యాటకులు, చరిత్రకారులు సందర్శిస్తున్నారని, అయితే ఈ పురాతన ప్రాంతాలకు దారితీసే మార్గాలు చిరువ్యాపారులు, ఆక్రమణలతో నిండిపోయి ఉన్నాయని, వీటిని తొలగించడటంలో సహకరించాలని డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లను కోరారు. షేక్‌పేట సెవెన్ టూంబ్స్ 108 ఎకరాల స్థలంలో 70కి పైగా కుతుబ్‌షాహీ వంశస్థులకు చెందిన సమాధులున్నాయని, వీటిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించేందుకు తాత్కాలిక జాబితాలో చేర్చిందన్నారు. అయితే ఈ టూంబ్స్ పరిసరాల్లో ఆక్రమణలు తొలగించాల్సి ఉందని ఆమె సూచించారు. హైదరాబాద్‌లో జనాభా ఒత్తిడి అధికంగా ఉందని ఇది పురాతన కట్టడాలు, పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. హైదరాబాద్ నగరంలో పురాతన కట్టడాలను పరిరక్షించటం ద్వారా వాటిని ముందు తరాలకు అందించటంలో జిహెచ్‌ఎంసి అధికారులు కీలక పాత్ర పోషించాలని ఆమె సూచించారు. ఈ సదంర్భంగా కుతుబ్‌షాహీ సమాధులు, వాటి చరిత్రను జిహెచ్‌ఎంసి అధికారులు విశాలాక్షికి వివరించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో పాటు వివిధ విభాగాధిపతులు కూడా పాల్గొన్నారు.