హైదరాబాద్

స్వైన్ సైరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: అసలే చలికాలం..ఆపై నగరంలో రికార్డు స్థాయిలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి ప్రభావం పెరిగింది. రోజురోజుటకీ వాతావరణం చల్లబడుతుండటంతో స్వైన్ ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నెల 21రోజుల్లోనే ఇప్పటి వరకు నలుగురు మృతి చెందటంతో నగరంలో స్వైన్‌ఫ్లూ ఆందోళన మరింత రెట్టింపయ్యింది. తాజాగా శనివారం యాదాద్రి జిల్లాకు చెందిన పది నెలల బాలుడికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు గుర్తించిన గాంధీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురికి కూడా లక్షణాలున్నట్లు గుర్తించి చికిత్స చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ, పారిశుద్ధ్యం సక్రమంగా లేని పాతబస్తీలోని పలు ప్రాంతాలు, మరికొన్ని మురికివాడల్లో డెంగీ అనుమానిత లక్షణాలతో అనేక మంది రోగులు స్థానిక క్లినిక్‌లలో చికిత్స పొందుతున్నారు. వీటితో పాటు మరికొన్ని రకాల సీజనల్ వ్యాధులతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. వీరిలో ఎక్కువ మంది స్వైన్ ఫ్లూ అనుమానిత లక్షణాలతో బాధపడుతూ, చిన్న చిన్న క్లినిక్‌లలో చికిత్సకే పరిమితమవుతున్నారు. ఇలాంటి వారే వ్యాధి బాగా ముదిరితే గానీ గాంధీ వంటి పెద్దాసుపత్రులకు రావటం లేదు. ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూ బారిన పడి గాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన ఎనిమిది మందిలో నలుగురు చనిపోగా, మరో నలుగురిలో ఇద్దరు వ్యాధి నయం కావటంతో డిశ్చార్జ్ అయ్యారు. మరో ఇద్దరి రక్తపు శ్యాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. వ్యాధి గుర్తించి, దాన్ని నివారణ విషయాలు పూర్తిగా తెలిసిన జిల్లా ఆరోగ్యవైద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తుండగా, ప్రజల్లో వ్యాధి, దాని నివారణ పట్ల అవగాహన లేకపోవటం పేదల పాలిట శాపంగా మారింది. దీంతో వ్యాధి ముదిరిన తర్వాత పెద్ద ఆసుపత్రుల్లో చేరినా, ఫలితం దక్కటం లేదు. వాతావరణం బాగా చల్లబడటంతో ఈ వ్యాధి ప్రబలే అవకాశాలెక్కువగా ఉన్నట్లు వైద్యులు ఎప్పటికపుడు హెచ్చరిస్తున్నా, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు కనీస నివారణ చర్యలు చేపట్టకపోవటం గమనార్హం. పేద, ధనిక వర్గాలు నివసించే దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధి ఆనవాళ్లు కన్పించటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాధి అనుమానిత లక్షణాలతో ప్రయివేటు ఆస్పత్రుల్లోనే ఎక్కువ సంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ లక్షణాలను సాధారణ అనారోగ్యంగా, జలుబుగా పరిగణించటం ప్రజల్లో సరైన అవగాహన లేదనేందుకు నిదర్శనం. ప్రభుత్వం కనీసం వ్యాధిపై అవగాహన, బారిన పడుకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను సైతం ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు, వృద్దులకు, అలాగే మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడిన వారికి ఈ వ్యాధి చాలా త్వరగా సోకే అవకాశాలున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఇవీ లక్షణాలు..
దగ్గు, జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, కళ్ల వెంట నీరు కారడం, నీరసంగా ఉండటంతో పాటు వాంతులు, విరోచనలు కన్పిస్తుంటాయి. మూడు రోజుల పాటు ఈ వైరస్ లక్షణాలు కన్పిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. దీనికి కోసం ప్రభుత్వం గాంధీ, ఫీవర్ ఆసుపత్రితో పాటు పలు ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ వైద్యులు నిర్లక్ష్యమా, లేక మందుల కొరతో తెలియదు స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు ఇక్కడకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
జాగ్రత్తలు..
స్వైన్‌ఫ్లూ వైరస్ బారిన పడకుండా కొన్ని జగ్రత్తలు పాటిస్తే వ్యాధికి దూరంగా ఉండవచ్చు. వీలైనంత వరకు వ్యాధి సోకిన వ్యక్తులు జనసమూహాల్లో వెళ్లకపోవడం మంచిది. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత పాటించడం చాలా అవసరం. దగ్గిన, తుమ్మిన నోటికి గుడ్డ అడ్డుగా పెట్టుకోవడం ఫ్లూ జ్వరం లక్షణాలలో భాదపడుతున్న వారు తరచూ చేతులతో కళ్లు, ముక్కు రుద్దుకోకూడదు. వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండాలి. ఇంట్లో, పని చేసే ఆఫీసులలో అందరూ ఉపయోగించే ఫోన్లను, వస్తువులను శుభ్రపరుస్తూ ఉండాలి. వారికి చేతులు కలపడం కూడ చెయ్యకూడదు. వైరస్ సోకిన వ్యక్తి కొన్ని రోజులుగా అందరికీ దూరంగా ఉండి, చికిత్స పొందేలా చూసుకోవాలి. వ్యాధి లక్షణాలు కన్పిస్తే మామూలుగా జ్వరం, దగ్గు, తుమ్ములే కాదా అని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవడం మంచిది.