హైదరాబాద్

36 రోజులు..రూ. 350 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: జిహెచ్‌ఎంసి ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం ఆశించిన స్థాయిలో జరిగే అవకాశాలు లేనట్టే. కార్పొరేషన్ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు లక్ష్యంగా పెట్టుకున్న స్థాయిలో ఆస్తిపన్ను వసూలు కాకపోయినా, దాదాపు లక్ష్యానికి చేరుగా, గత కలెక్షన్‌తో పోల్చితే అదనంగా కోట్లలో పన్ను వసూలు చేసుకుంది. కానీ ఈ సారి ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 36రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఇదివరకు లక్ష్యంగా నిర్ణయించిన రూ. 1500 కోట్లలో మరో రూ 350 కోట్ల మేరకు పన్ను వసూలు చేసుకోవాల్సి ఉంది. గత నవంబర్ మాసంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయటంతో పాత నోట్లతో కూడా పన్నును స్వీకరణకు అవకాశమిచ్చిన బల్దియా దేశంలో ఏ కార్పొరేషన్ చేయని విధంగా సుమారు రూ. 370 కోట్ల మేరకు వసూలు చేసుకుంది. అపుడే పాత నోట్లతో పెద్ద మొత్తంలో రావల్సిన బకాయిలు, వర్తమాన ఆస్తి పన్ను డిమాండ్లు వసూలయ్యాయి. అంతేగాక, పాత నోట్లతో, నగదు రహిత లావాదేవీలతో పన్నును చెల్లించే వారికి నగదు బహుమతులను ప్రకటించటంతో చాలా మంది బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చెల్లింపులు చేశారు. అంతేగాక, ఇపుడు బల్దియా శాసన మండలి టీచర్స్ స్థానం, స్థానిక సంస్థల మండలి స్థానం ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటం కొంత వరకు కలెక్షన్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ఫలితంగా లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1250 కోట్ల మేరకు ఆస్తిపన్ను వసూలయ్యే అవకాశాలు అంతంతమాత్రమే. ప్రతి ఏటా సక్రమంగా చెల్లించే వారిలో సుమారు 60 శాతం నుంచి 70శాతం వరకు బకాయిదారులు పాత నోట్లతోనే పన్నును చెల్లించినా, నేటి వరకు కలెక్షన్ సుమారు రూ. 900 కోట్లకు మించలేదు. కానీ అధికారులు మాత్రం గత ఆర్థిక సంవత్సరం కలెక్షన్‌తో పోల్చితే రూ. 140 కోట్లు అధికంగా వసూలు చేశామని చెప్పుకొస్తున్నారు. ప్రతి సంవత్సరం అధికారులు అధిక ఒత్తిడి చేసి చేసే వసూళ్ల పెద్దనోట్ల రద్దు సమయంలోనే వసూలైనట్లు, ఇపుడు ఏమైనా ఒత్తిడి చేయాలంటే అది ఏళ్ల తరబడి పెద్ద మొత్తంలో బకాయిపడ్డ మొండి బకాయిదారులపైనే. ఆస్తిపన్ను కలెక్షన్ కాస్త నెమ్మదిగానే సాగుతున్న సమయంలో మండలి టీచర్స్, స్థానిక సంస్థల స్థానం ఎన్నికలు రావటం కొంత ప్రభావాన్ని చూపనున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం కూడా ఫిబ్రవరి మొదటి వారంలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. అయినా సుమారు రూ. 1100 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఉన్నంత బిజీగా బల్దియా మండలి ఎన్నికల్లో లేకపోయినా, ప్రతి ఏటా పన్ను చెల్లిస్తున్న వారిలో అత్యధిక శాతం మంది బకాయిదారులు ఇదివరకే పాత నోట్లతో, నగదు బహుమతుల కోసం చెల్లించటంతో ఆర్థిక సంవత్సరం ముగింపుకు మిగిలి ఉన్న మరో 36 రోజుల్లో పెద్దగా కలెక్షన్ అయ్యే అవకాశాల్లేవని చెప్పవచ్చు.