హైదరాబాద్

బల్దియా బడ్జెట్‌పై నేడు సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: మహానగర ప్రజలకు అత్యవసర, పౌరసేవలతో పాటు అభివృద్ధి పనులను అందించటంలో కీలక పాత్ర పోషించే జిహెచ్‌ఎంసి రానున్న ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌పై నేడు ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ కౌన్సిల్ సమావేశంనిర్వహించరాదన్న నిబంధన ఉంది. కానీ బల్దియా బడ్జెట్‌కు సంబంధించి కౌన్సిల్‌లో తప్పకుండా చర్చ కూడా జరగాల్సి ఉన్నందున, ఇప్పటికే సమయం మించి పోయినందున బల్దియా అధికారులకు ఈ సమావేశ నిర్వాహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నట్లు తెలిసింది. రూ. 5643 కోట్లతో రూపొందించిన బడ్జెట్ ముసాయిదాపై ఈ సమావేశంలో అధికార, విపక్షాలకు చెందిన సభ్యులు చర్చించనున్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన రూ. 5061.74 కోట్ల బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులు, ఖర్చులపై కూడా చర్చ జరగనుంది. ముఖ్యంగా అతి ముఖ్యమైన శానిటేషన్, ప్రాజెక్టులు వంటి అంశాలకు జరిపిన కేటాయింపులపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అవసరమైతే స్వల్పంగా మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం లేకపోలేదు. కౌన్సిల్‌లోని 150 మంది సభ్యుల్లో 99 మంది టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు కాగా, అధికార పార్టీ అనధికార మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీకి చెందిన 47 మంది సభ్యులుండటంతో సుదర్ఘీ చర్చనానంతరం పాలక మండలి ఏకగ్రీవంగా బడ్జెట్‌ను ఆమోదించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి సారి కూడా వేల కోట్లతో బడ్జెట్‌ను రూపకల్పన చేస్తున్న బల్దియా అందులో జరిపిన కేటాయింపుల్లో కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతేగాక, గత పాలక మండలిలో కార్పొరేటర్లకు వార్షిక బడ్జెట్ కోటి రూపాయలుగా నిర్ణయించగా, ఈ సారి ప్రత్యేక వార్షిక బడ్జెట్ అంటూ ఏమీ లేకపోవటంతో వారి ప్రతిపాదనలకు ఎలా ఖర్చు చేస్తారన్న విషయంపై మజ్లిస్ స్పష్టత కోరే అవకాశముంది.

బడ్జెట్ వివరాలు
* రెవెన్యూ ఆదాయం(ట్యాక్సు రెవెన్యూ, ఆసైన్డ్ రెవెన్యూ, ఫీజులు, యూచర్ ఛార్జీలు, అమ్మకాలు, కొనుగోళ్లు, రెవెన్యు గ్రాంట్లు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా రూ. 2926.82 కోట్లుగా పొందుపర్చారు
* అలాగే రెవెన్యూ వ్యయం(సంస్థాగత ఖర్చులు, పరిపాలనపరమైన ఖర్చులు, ఆపరేషనల్, మెయింటనెన్స్, వడ్డీలు, ఫైనాన్స్ ఛార్జీలు, ప్రొగ్రాం ఖర్చులు-రూ. 2616.27 కోట్లుల
* రెవెన్యూ మిగులు-310.55 కోట్లు
* పెట్టుబడుల స్వీకరణ(రెవెన్యూ ట్రాన్స్‌ఫర్స్, ప్లాన్ గ్రాంట్లు, కంట్రిబ్యూషన్, రెగ్యులరైజేషన్ ఫీజులు, అప్పులు ఇతరత్ర-3026.73 కోట్లు
* పెట్టుబడుల ఖర్చు-ల్యాండ్, ల్యాండ్ ఇంప్రూవ్‌మెంట్స్, బిల్డింగ్‌లు, బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు, సబ్‌వేలు, రోడ్లు, పేవ్‌మెంట్స్, మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు, వాటర్ సప్లై, సీవరేజీ, వరద నీటి కాలువలు, వీది ధీపాలు, ఇతర పనులు-యంత్రాంగం-పరికరాలు, వాహనాలు, ఫర్నిచర్,యూసిడి(స్లమ్)-రూ. 3026.73 కోట్లు

రూ. 581.26 కోట్లు పెంపు
వర్తమాన ఆర్థిక సంవత్సరం(2016-17)కు రూ. 5061.74 కోట్లతో రూపొందించిన బల్దియా బడ్జెట్‌ను రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ. 581.26 కోట్లకు పెంచుతూ రూ. 5643.00 కోట్లతో రూపొందించారు.
ఖాతా వివరాలు 2016-17 2017-18
రెవెన్యూ ఆదాయం 2723.24 2926.82
రెవెన్యూ వ్యయం 2586.45 2616.27
రెవెన్యూ మిగులు 136.79 310.55
పెట్టుబడుల స్వీకరణ 2475.29 3026.73
పెట్టుబడుల వ్యయం 2475.29 3026.73

జనంలోకి జలమండలి

హైదరాబాద్, మార్చి 24: ఈసారి వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి సమస్య ఉండబోదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ శాసనసభలో ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా జలమండలి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే జలమండలిలోని ప్రతి డివిజన్ మేనేజర్, డిజిఎం, జిఎంలు తప్పనిసరిగా వారి డివిజన్లలో క్షేత్ర స్థాయి పర్యటనలు జరిపి ప్రజల్లోకి వెళ్లాలని జలమండలి ఎండి దాన కిషోర్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికపుడు మంచినీటి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన అవసరముందని ఆయన సూచించారు. అంతేగాక, వేసవిలో ఏర్పడే నీటి కొరత సమస్యను అధిగమించేందుకు ఇప్పటికే చేతిపంపులు, బోర్‌వెల్స్, వాల్వ్‌ల మరమ్మతుల పనుల కోసం రూ. 5.8కోట్లతో రూపొందించిన వేసవి కార్యచరణ ప్రణాళిక అమలును క్షేత్ర స్థాయిలో మరింత ముమ్మరం చేసి, ఈ ప్లాన్ కింద సూచించిన పనులన్నీ వచ్చే నెల రెండో వారం కల్లా పూర్తి చేయాలని కూడా ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రతి ఒక్క డివిజన్‌లోని అధికారులు, బోర్డు సిబ్బంది, మీటర్ రీడర్లు, లైన్ మెన్లతో కలిసి పర్యటిస్తే ప్రజల సమస్యలను తెల్సుకుని వీలైనంత త్వరగా పరిష్కరించే ఆస్కారముంటుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా మంచినీరు సరఫరా అయ్యే సమయంలో ఈ పర్యటనలు జరిపితే లో ప్రెషర్, అరకొర సరఫరా, కలుషిత నీటి సరఫరా వంటి సమస్యలను తెల్సుకోవచ్చునని వివరించారు. అంతేగాక, నీటిలో క్లోరిన్ మోతాదును తనిఖీ చేయవచ్చునని తెలిపారు. మంచినీటి సరఫరాలో ఎలాంటి లోపాలు, సమస్యలున్నాయో వినియోగదారులను నేరుగా అడిగి తెల్సుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఈ రకంగా తెల్సుకున్న సమస్యలు, వాటి పరిష్కారం వంటి పురోగతిని ఎప్పటికపుడు ప్రధాన కార్యాలయానికి పంపించాలని ఎండి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకువస్తున్నామన్న విషయాన్ని గుర్తించి నగర ప్రజలు నీటిని వృథా కాకుండా పొదుపుగా వినియోగించాలని ఎండి కోరారు.
ఆ ప్రాంతాలపైనే ప్రత్యేక దృష్టి
ముఖ్యంగా నేటికీ మంచినీటి వ్యవస్థ విస్తరించని బస్తీలు, మురికివాడలు, శివారు ప్రాంతాల్లో వేసవి ప్రణాళిక కింద చేపట్టాల్సిన పనులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. రూ. 5.82 కోట్లతో రూపొందించిన ఈ ప్రణాళిక కింద మంజూరైన 441 పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. దీనికి తోడు 1900 కోట్ల వ్యయంతో శివార్లకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. వీటి పురోగతిపై ఎండి తరుచూ సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు తగు సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. మంచినీటి పైప్‌లైను విస్తరించని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నగర శివార్లలో పూర్తయిన రిజర్వాయర్లు, పైప్‌లైను ద్వారా అక్కడి ప్రజలకు నీటిని సరఫరా చేసేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈ చర్యలు ఫలిస్తే సుమారు 10వేల వాటర్ కనెక్షన్లకు లబ్ది చేకూరే అవకాశముంది.