హైదరాబాద్

స్థానిక సంస్థలను బలోపేతం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: కేంద్రంలో ఎన్డీఎ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు మాధ్యమిక స్థానంలోని స్థానిక సంస్థలలో ఆర్థిక ఇబ్బందులకు చోటు చేసుకునే దశకు చేరుకున్నాయని రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ తెలిపారు. శాసనసభ కమిటీ హాల్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ జడ్పీటిసిల సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, సంజీవరావు, యాదయ్య, ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం నరేందర్‌రెడ్డి, శంబీపూర్ రాజు తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌కు గత కొంతకాలంగా మైనింగ్, స్టాంప్ డ్యూటీ వాటా నిధులు రావటం లేదని వాటిని ఇప్పించి గ్రామాలలో అభివృద్ధి పనులకు సహకరించాలని చైర్‌పర్సన్ సునీతారెడ్డి, జడ్పీటిసిలు మంత్రులకు వినతిపత్రాలు అందించారు. ఈ నేపథ్యంలో గతంలో కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ జీఫ్ నిధులను నిలిపివేసి నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు అందించే నిర్ణయం తీసుకోవటంతో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు నిధులు తగ్గాయన్నారు. ఫలితంగా సమైఖ్య రాష్ట్రంలో ఐదంచల పంచాయతీరాజ్ వ్యవస్థలలో ఎంతో కీలకంగా ఉన్న ఇవి నిధుల లేమితో సతమతమవుతూ వస్తున్నాయన్నారు. అయితే ఈ పరిణామాలను కొందరు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదని అనుకుంటున్నారని ఇది సరికాదన్నారు. సదరు విధానాల సవరణ కోసం తాము కేంద్రానికి నివేదించామన్నారు. అయితే జెడ్పీటిసి సభ్యులకు నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల కంటే ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తదితర పనులను ముందుండి చేయించటంతో ఎంతో పేరు వస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలకు అందాల్సిన నిధుల కోసం సిఎం కెసిఆర్‌కు నివేదిస్తామని తెలిపారు.
జిల్లా అభివృద్ధికి మంత్రి మహేందర్‌రెడ్డి నిరంతరం తపిస్తున్నారని కితాబునిస్తూ జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు జెడ్పీటిసిలు,ఎంపిపిలు భాగస్వామ్యం కావాలని సూచించారు. మండలాల వారిగా తాము సమస్యలను గుర్తించి నిధులు అందించే ఏర్పాటుచేస్తామని అన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గతంలో 12, 13, 14 ఫైనాన్స్ నిధులు కేంద్రం నుండి జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు తక్కువగానే అందేవన్నారు. కేంద్రం చర్యలు వీటికి ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెబుతూ సిసి రోడ్లతోపాటు పలు వౌలిక సదుపాయాలకు కనీసం 15 నుండి 20 లక్షల నిధులు అందేలా చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. ఇలా ప్రభుత్వం కంట్రిబ్యూషన్‌తో సాగుతున్న ఉపాధి నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మురుగు కాల్వలు, లింకు రోడ్ల నిర్మాణాలు, మెటలింగ్, సిసి రోడ్లు ఇలా నిర్మించుకుంటే పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఇలా రాష్ట్రంలో కనీసం వెయ్యి కోట్ల నిధుల ఉపాధి పనులను చేపట్టవచ్చని ఇంటికి ఇద్దరు కష్టపడితే కాంపోనెంట్‌తో మూడు వేల కోట్ల పనులు సాగే వీలుంటుందని మంత్రి వివరించారు. సిఎం కెసిఆర్ ఎన్నో నిధులను వివిధ పథకాల రూపంలో అందిస్తున్నారని వీటిని ప్రజల దరి చేర్చాలని జిల్లా సమస్యలను కెసిఆర్‌కు నివేదిస్తామని జూపల్లి వివరించారు. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నిధుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సిఎం కెసిఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాది కోట్ల నిధుల పనులు జిల్లాలో సాగేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. జిల్లాకు అందాల్సిన మైనింగ్ స్టాంప్ డ్యూటీలను అందేలా సిఎం కెసిఆర్‌కు నివేదిస్తామన్నారు. పేదలకు పథకాలను అందించటంలో జెడ్పీటిసిలు ముందుండాలని సూచించారు. పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి నిధులు లేక జెడ్పీటిసిలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రులు కెటిఆర్, జూపల్లి, మహేందర్‌రెడ్డిలకు వివరించారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సిఇఓ రమణారెడ్డి, జెడ్పీటిసిల ఫోరం అధ్యక్షుడు సంజీవరెడ్డి, జడ్పీటిసీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.