హైదరాబాద్

విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేటులో ఏప్రిల్ 3 నుండి 13 వరకు నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమ నిర్వహణపై ఎంఇఓలు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయలు, సిఆర్పీలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఎన్జీఓలతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017-18 విద్యా సంవత్సరం ఈ నెల 21న మొదలుకావడం ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం తగ్గిపోతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపాఠశాలలో ఇప్పుడున్న నమోదు శాతానికి అదనంగా 20 నుండి 25 శాతం పైగా నమోదు అయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా అంగన్వాడి కేంద్రాల్లోని పిల్లలను గుర్తించి వారిని సమీప పాఠశాలల్లో చేర్పించడంతోపాటు నిర్దేశిత కుటుంబాలను గుర్తించి వారితో ముఖాముఖి చర్చించి, వారి పిల్లలను పాఠశాలలో చేర్పించే బాధ్యత ప్రతి అంగన్వాడి కార్యకర్త తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంచి ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ప్రజల సహకారం తీసుకొని బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల పరిశుభ్రత, త్రాగునీరు, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లతోపాటు పాఠశాలలకు సున్నం వేయడం వంటి పనులను చేపట్టాలని ఆయన ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. 5 నుండి 15 తేదీలోపు అప్‌డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బడిబయటి బాలబాలికలను (మధ్యలో బడిమానిన వారు), బాలకార్మికులను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లా విద్యా శాఖాధికారి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 3న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లతో సమావేశం, గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి నమోదు కార్యక్రమం, 4న బడిమానేసిన పిల్లల తల్లిదండ్రులతో సమావేశం, పాఠశాలల్లో నమోదు కార్యక్రమం, 6న అంగన్వాడి, భవిత కేంద్రాలు, ఇటుకబట్టీలు సందర్శన, పిల్లల నమోదు కార్యక్రమం, 7న సిబ్బందితో సమావేశం, 10న పాఠశాల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, హరితహారం 11న బాలకార్మికులను పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమం, 12న స్వచ్ఛ పాఠశాలల కింద బడులను పరిశుభ్రం చేయడం, 13న బడిబాటపై సమీక్ష, విద్యార్థుల సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పిడి ఐసిడియస్, పిడిఎన్‌పిఎల్‌పి, ఎంఇఓలు తదితరులు పాల్గొన్నారు.