హైదరాబాద్

జై శ్రీరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/బేగంపేట/చార్మినార్, ఏప్రిల్ 11: జై బజరంగభళి..జై శ్రీరామ్.. జై జై హనుమా..బనాయేంగే మందిర్ నినాదాలతో పాటు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతుడైన శ్రీ రాముడిని కొలుస్తూ సాగిన భక్తిగీతాలతో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా, ప్రశాంతంగా జరిగింది.
భారీ పోలీసు బందోబస్తు మధ్య యాత్ర ముగిసింది. ఆ తర్వాత సికిందరాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్‌కు చెందిన ప్రముఖులు భక్తులనుద్దేశించి ప్రసంగించారు.
అసలే ఎండాకాలం, మిట్ట్టమధ్యాహ్నం ఎండలు మండిపోతున్నా, ఏ మాత్రం లెక్కచేయకుండా లక్షలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొని తన భక్తిప్రపత్తులను చాటుకున్నారు.
బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో గౌలీగూడ శ్రీ రామ్ మందిరం నుంచి ఉదయం పది గంటలకు ప్రారంభమైన ప్రారంభమైన ఈ శోభాయాత్ర శ్రీ భారతీ కమలానంద స్వామి, మహారాష్ట్ర శ్రీనాథ పీఠానికి చెందిన జితేంద్రనాథ్‌జీ మహారాజ్, బజరంగ్‌దళ్ అఖిల భారతీయ అధ్యక్షులు మనోజ్ వర్మలు ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు. కోఠి, నారాయణగూడ, ఆర్టీసి క్రాస్‌రోడ్డు, ముషీరాబాద్, కవాడిగూడ ప్రాగా టూల్స్, బైబిల్ హౌజ్, సికిందరాబాద్‌ల మీదుగా తాడ్‌బంద్ శ్రీ హనుమాన్ దేవాలయం వరకు చేరుకుంది. సుమారు ఆరు గంటల పాటు 27 కిలోమీటర్ల పొడువున సాగిన ఈ యాత్ర నిర్వాహకులు, పోలీసులు ఊహించిన సమయం కన్నా ముందుగానే తాడ్‌బన్ హనుమాన్ దేవాలయాన్ని చేరుకుంది. గతంతో పోల్చితే మరింత ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. జనం కూడా గతం కన్నా రెట్టింపు సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల్లో ఎక్కువ మంది యువకులు కాషాయపు జెండాను చేతబూని ర్యాలీలో పాల్గొని చేసిన జై శ్రీరామ్ నినాదాలతో పురవీధులు పులకరించిపోయాయి. గౌలీగూడ నుంచి ప్రారంభమైన శోభాయాత్రకు కోఠి, సుల్తాన్‌బజార్, నారాయణగూడ, ఆర్టీసి క్రాస్‌రోడ్డు, ముషీరాబాద్, కవాడిగూడ, బైబిల్ హౌజ్, సిటీలైట్ చౌరస్తా, బాటా చౌరస్తాతో పాటు సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాంకాళీ వీదిలో కూడా ఏర్పాటు చేసిన స్వాగత వేదికలు ఘన స్వాగతం పలికాయి. అసలే ఎండా కాలం, ఆపై ఎండలు బాగా మండిపోవటంతో భక్తుల సౌకర్యార్థం పలు ఆధ్యాత్మిక సంస్థలు, యువజన సంఘాలు దారి పొడువున వాటర్ ప్యాకేట్లు పంపిణీ చేయగా, స్వాగత వేదికల వద్ద అల్పాహారం, స్వీటుతో పాటు మజ్జిగను, మరికొన్ని స్వాగత వేదికలు కీరా, క్యారెట్ ముక్కలను పంపిణీ చేశాయి. లక్షలాది మంది భక్తులతో సాయంత్రం అయిదు గంటల సమయంలో యాత్ర తాడ్‌బన్ హనుమాన్ దేవాలయానికి చేరుకుంది.