హైదరాబాద్

ఎప్పుడైనా..ఎక్కడైనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: మహానగరంలో వివిధ రకాల పనులపై ఇంటి నుంచి బయటకు వచ్చే వారు మూత్ర విసర్జన చేయాలంటే అనేక అవస్థలు పడుతుంటారు. ఇందులో మహిళల పరిస్థితి మరింత వర్ణణాతీతం. అయితే కోటి మంది జనాభా ఉన్న నగరంలో ప్రస్తుతం 435 పబ్లిక్ టాయిలెట్లు, రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన వంద మాడ్రన్ ఫ్రీ ఫ్యాబ్రికెటేడ్ టాయిలెట్లకు తోడు మరో వంద అందుబాటులోకి వచ్చాయి. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టాయిలెట్లు కేవలం వంద సంఖ్యలో ఉండటంతో పలు చోట్ల బహిరంగ మూత్ర విసర్జన జరుగుతున్నట్లు గుర్తించిన జిహెచ్‌ఎంసి ప్రజలకు తగిన సంఖ్యలో టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చే అంశంపై దృష్టి సారించారు. దేశంలోని అన్ని స్థానిక సంస్థలు ప్రజలకు అందిస్తున్న పౌరసేవల నిర్వహణకు సంబంధించి వార్షిక పరీక్షగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా టాయిలెట్లను పెంచేందుకు జిహెచ్‌ఎంసి కొద్ది నెలలుగా కృషి చేస్తోంది. అంతేగాక, నగరప్రజలకు మెరుగైన సేవలందించటంలో వ్యాపార సంస్థల సామాజిక బాధ్యతను గుర్తుచేసేలా గాంధీగిరిలో వారిని అంగీకరింపజేస్తోంది. కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు వారి వద్ద టిఫిన్ గానీ భోజనం కానీ చేస్తేనే కనీసం టీ, కాఫీలు తీసుకునేంటేనే మూత్రశాలల వినియోగానికి అనుమతించేవారు. కానీ జిహెచ్‌ఎంసి చూపిన ప్రత్యేక చొరవతో రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్న ఎవరైనా ఎక్కడైనా తమకు అందుబాటులో ఉన్న వ్యాపార సంస్థల్లోని టాయిలెట్లను వినియోగించుకోవచ్చు. అంతేగాక, జిహెచ్‌ఎంసిపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల షీ టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు పలు కార్పొరేట్ సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిహెచ్‌ఎంసి విరాళాలను సేకరిస్తోంది. దీనికి తోడు సామాన్యులంతా తమ అసవసరాలకు తగిన విధంగా నగరంలోని హోటళ్లు, మెస్‌లు, పెట్రల్ బంకులు వంటి ఇతరాత్ర వ్యాపార సంస్థల్లో ఏర్పాటు చేసిన మూత్రశాలలను ప్రజలను వినియోగించుకునేలా యజమాన్యాలను ఒప్పించింది. ఇప్పటికే నగరంలోని 365 పెట్రోల్ బంకుల్లోని టాయిలెట్లను అందరూ వినియోగించుకునేలా అందుబాటులోకి తేవటంలో జిహెచ్‌ఎంసి సఫలీకృతమైన సంగతి తెలిసిందే! అంతేగాక, కొద్దిరోజుల క్రితం ఒక్కరోజే కమిషనర్ జనార్దన్ రెడ్డి పలు హోటళ్లు, రెస్టారెంట్ల ఆవరణలోని మూత్రశాలలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు జిహెచ్‌ఎంసి యాజమాన్యాలతో ఫ్రెండ్లీగా, గాంధీగిరితో జరిపిన చర్చలతో అందుబాటులోకి తెచ్చిన టాయిలెట్లతో ప్రజలకు అందుబాటులోకి వచ్చినవాటి సంఖ్య సుమారు 900కు పెరిగాయి. అయితే వ్యాపార సంస్థల యజమాన్యాలతో ఇదే రకమైన చర్చలు, చక్కటి సంబంధాలను కొనసాగి నగరంలోని అన్ని షాపులు, షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార సంస్థల్లోని టాయిలెట్లను ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేగలిగితే నగరంలో బహిరంగ మూత్ర విసర్జనను పూర్తిగా అరికట్టవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.