హైదరాబాద్

బ్రహ్మానందంకు చార్ల్లీచాప్లిన్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలుగు సినీ పరిశ్రమలో హస్యనటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గిన్నిస్ రికార్డ్ సాధించడమే కాకుండా బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో ప్రపంచ ప్రఖ్యాత హాస్యనటుడు చార్లీ చాప్లిన్ అవార్డును అందుకున్నారు. ఆకృతి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి బ్రహ్మానందంను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమాలలో హాస్యం గురించి ప్రస్తావిస్తూ బ్రహ్మానందం హాస్యం సహజంగా ఉంటుందని అన్నారు. హస్యం ఆరోగ్యకరంగా వుండాలని చెప్తూ బ్రహ్మానందంను హాస్య బ్రహ్మగా మధుసూదనాచారి అభివర్ణించారు. కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి సిల్వర్ హ్యాట్‌ను బ్రహ్మానందంకు అలంకరించారు. బ్రహ్మానందం అభిమానులలో తానొకడినని, వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని అన్నారు. కడు పేదరికంలో జన్మించి బాలకార్మికుడిగా ఎదిగిన చార్లీచాప్లిన్ తన హాస్యంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందారని, నవ్వించడం చాలా కష్టమని, నవ్వడం యోగమని ఆయన అన్నారు. వెయ్యి సినిమాలకు పైగా నటించిన బ్రహ్మానందంను సుభాషణ్‌రెడ్డి ప్రశంసించారు.