హైదరాబాద్

టిఆర్‌ఎస్ పాలన తీరు మారనందుకే ప్రజాపోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఏప్రిల్ 30: ఉద్యమ పార్టీగా భావించి రాష్ట్ర ప్రజలు టిఆర్‌ఎస్‌ని ఆదరించి అధికారంలోకి తెచ్చారని తెలంగాణ జెఎసి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ఆదివారం తాండూరులో నిర్వహించిన విద్యావంతుల ఐక్యవేదిక జిల్లా మహాసభలో కోదండరాం పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో నేడు బాధాకరమైన దినం అన్నారు. కేంద్ర జలవనరుల చీఫ్ ఇంజనీరుగా పనిచేసిన పదవీ విరమణ పొందిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి జలవనరుల ముఖ్య సలహాదారుడిగా తన వంతు బాధ్యతగా సేవలు అందించిన రామరాజు విద్యాసాగర్ రావు మరణం యావత్ తెలంగాణ వాదులకు తీరని లోటని అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను అక్రమించటం సరైన విధానం కాదన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక పద్ధతులను ఎత్తిచూపారు. కాగా రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, విద్య ఉద్యోగ వైద్య రంగాలలో కొనసాగుతున్న అసమానతలపై, జెఎసి, విద్యావంతుల ఐక్యవేదిక సమైక్యంగా కలిసి పోరాడుతున్నట్లు వివరించారు. ప్రజల పక్షాన నిలిచి మాట్లాడటం విద్యావంతులు, బుద్ధిమంతుల ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. కాగా తాండూరు ప్రాంతంలో 2009 నుండి ఒక ఉప్పెనలా తెలంగాణ ఉద్యమం కొనసాగిందన్నారు. ఇక ముందు తాము మొదలు పెడుతున్న ప్రజాస్వామిక పోరాటానికి తాండూరు ఉద్యమకారులు ముందుంటారని పేర్కొన్నారు. నాడు సీమాంధ్రుల పాలనలో ఎన్నడూ కోదండరాం ఇంటిపై ప్రభుత్వ దాడి జరుగలేదన్నారు. కానీ, నేడు మన వాళ్లు టిఆర్‌ఎస్ పాలకుల హయంలో కోదండరాం ఇంటిపైకి పోలీసులు వచ్చి అర్థరాత్రి అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చిందని సిఎం కెసిఆర్‌పై వ్యంగాస్త్రాలు సంధించారు. ఇక ముందు పోరాటాల అవసరం ఉండదు, మన రాష్ట్రం మన పాలన అని భావించామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణవాదుల్ని మరోసారి జాగృతం చేయకుంటే కెసిఆర్ వంటి మహానేత హిట్లర్, నిజాం సర్కార్ పాలనలో ప్రజలు కుమిలిపోవాల్సి వస్తుందని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎవ్వరో ఉద్యమ స్ఫూర్తిలేని నాయకులు పెత్తనం చెలాయిస్తే ప్రజలు నోళ్లు మూసుకుని ఉండాల్సిన దుస్థితిలో మనం ఉండరాదని, మరో పోరాటానికి నాంది పలుకు తున్నట్లు వెల్లడించారు. విపక్షాల నోరు నొక్కి నేడు భూసేకరణ చట్టం శాసనసభలో ఏకపక్షంగా అమలు పర్చటం ఈ పాలకుల దౌర్జన్య పద్ధతులకు నిదర్శనమని పునరుద్ఘాటించారు. కాగా మే 17న హైదరాబాద్‌లో ధర్నాచౌక్ తరలింపుపై పోరాటానికి సమయాత్తం అవుతున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు వస్తున్న వార్తలకు స్పష్టత లేదని చెప్పారు. కోదండరాంతో పాటు విద్యావంతుల ఐక్య వేదిక రాష్ట్ర ప్రతినిధులు ఇటిక్యాల పురుషోత్తం, తిప్పర్తి యాదయ్య, విద్యావంతుల ఐక్య వేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మీ, పి.లక్ష్మీ, నాగయ్య, పత్తిరెడ్డి, జిల్లా విద్యావంతుల ఐక్యవేదిక అధ్యక్షుడు నర్సింలు, జిల్లా జెఎసి అధ్యక్షుడు సోమశేఖర్, ప్రతినిధులు మధన్‌రెడ్డి, బస్వరాజ్ పాల్గొన్నారు.

పద్య నాటకాలను కాపాడుకోవాలి
కాచిగూడ, ఏప్రిల్ 30: పద్యనాటకాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని రసమయి అధినేత డా.ఎంకె రాము అన్నారు. కల్పనా కళానికేతన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘పాండవోద్యోగము’ పద్యనాటక ప్రదర్శన ఆదివారం చిక్కడపల్లి గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాము మాట్లాడుతూ నేడు పద్యనాటకాలకు ఆదరణ తగుతోందని వాటిని పరిరక్షించుకోని భావితరలకు అందించాల్సిన బాధ్యత కళాకారులపై ఉందని పేర్కొన్నారు. నాటక ప్రదర్శనకు ముందు బాలసచ్చిదానందం చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ సాహితీవేత్త డా.ఓలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు డా.కళావేంకట దీక్షితులు, సంఘసేవకుడు వై.రాజేంద్రప్రసాద్, రసాంజలి అధ్యక్షుడు వై.మల్లిఖార్జునమ్, కళాపోషకులు కె.రాజశేఖర్ గుప్త, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు దొంతి జంగయ్యగౌడ్, రత్నాకరశర్మ పాల్గొన్నారు.