హైదరాబాద్

దేశానికి మనమే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: పారిశుద్ధ్య పనులు, ఘన వ్యర్థాల నియంత్రణలో జిహెచ్‌ఎంసి దేశానికే ఆదర్శం కానుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా చేపడుతున్న తడి,పొడి చెత్త వేర్వేరు కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీన పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని అన్ని స్థానిక సంస్థలు అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి సారిగా నగరంలోని 22లక్షల కుటుంబాలకు రెండు బిన్లను చొప్పున ఇప్పటికే పంపిణీ చేసిన జిహెచ్‌ఎంసి ప్రతి ఇంటి నుంచి తడి,పొడి చెత్త వేర్వేరుగా వచ్చేందుకు అనేక రకాల అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టింది. అంతేగాక, ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండేలా స్వచ్ఛ ఆటో టిప్పర్లను కూడా పంపిణీ చేసింది. కుటుంబంగా కలిసి ఉందాం..తడి,పొడి చెత్తను వేరుచేద్దాం! అన్న నినాదంతో పలు కార్యక్రమాలను కూడా చేపట్టి ఆశించిన ఫలితాలను రాబట్టింది. జిహెచ్‌ఎంసి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ మున్సిపల్ వ్యవహారాల శాఖ గుర్తించి, ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం మొత్తం అమలు చేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు స్వచ్ఛ భారత్ మిషన్ దేశంలోని దాదాపు 4వేల పై చిలుకు మున్సిపల్ సంస్థలకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోని దాదాపు వెయ్యి 116 ఓపెన్ గార్బెజీ పాయింట్లను కూడా ఎత్తివేసేందుకు వినూత్న కార్యక్రమాలను చేట్టింది. ఇందులో భాగంగా ముఖ్యంగా అలాంటి ప్రాంతాలను గుర్తించి ముగ్గులు వేయటం, దీపావళి వంటి పండుగలను ఇలాంటి ప్రాంతాల్లో నిర్వహిస్తూ వచ్చింది. జిహెచ్‌ఎంసి పరిధిలోని సుమారు 4లక్షల 50వేల మంది స్వయం సహాయక బృందాల మహిళల సేవలను తడి,పొడి చెత్తను వేరు చేసేందుకు ఉపయోగించుకుంటోంది. వీరిలో క్రీయాశీలకంగా, చురుకుగా ఉన్న మహిళా సభ్యుల ద్వారా నగరవాసులను చైతన్యపర్చటం సోషల్ యాక్షన్ బృందాలను ఏర్పాటు చేసి, వారికి స్వల్పకారణాలతో విడిపోయిన కుటుంబాలను కలిపే బృహత్తర బాధ్యతలను సైతం జిహెచ్‌ఎంసి అప్పగించింది. దీంతో పాటు నగరంలోని అన్ని పాఠశాలల్లో చెత్త వేరు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, వాటి వల్ల కలిగే లాభాలపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను కూడా కల్పించింది. ఈ రకంగా రకరకాలుగా జిహెచ్‌ఎంసి చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలు రావటాన్ని గుర్తించిన స్వచ్ఛ భారత్ మిషన్ ఇదే రకమైన కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. కాగా,హైదరాబాద్ నగరంలో చెత్తను తడి,పొడిగా వంద శాతం వేరు చేసే కార్యక్రమంపై నగరవాసులకు నిరంతరం చైతన్యం కల్పించేందుకు గాను ఈ నెల 5వ తేదీన ప్రత్యేక కార్యక్రమాల నిర్వాహణకు కూడా జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

పేకాట ఆడుతూ పట్టుబడ్డ
ఆరుగురు కానిస్టేబుళ్లు

హైదరాబాద్, మే 2: నగరంలోని సైఫాబాద్‌లో పేకాట స్తావరంపై పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. పేకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. వారి వద్ద నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు.నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హుక్కా సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. హుక్కా సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.