హైదరాబాద్

కలహాల ‘కమలం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: మహానగర పాలక సంస్థ ఎన్నికల దగ్గరపడుతుండటంతో వివిధ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నాయి. ఇప్పటికే ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్, తెరాస పార్టీలు ప్రకటించటం, తమ మిత్రపక్షమైన తెలుగుదేశంతో కలిసి పొత్తు పెట్టుకుని పోటీలో దిగుతామని ప్రకటించిన కమలదళంలో ‘బీఫ్ ఫెస్టివల్’ చిచ్చు పెట్టింది. ఒకవైపు గో సంరక్షణ, హింధూ ధర్మ పరిరక్షణ కోసం తాను బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే అందుకు సహకరించాల్సిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటాన్ని తప్పుపడుతూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత విభేధాలను ప్రతిబింబిస్తోంది. తెలంగాణ భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు జి. కిషన్‌రెడ్డిపై గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేయటం కేవలం కమలనాధుల్లోనే గాక, టిడిపి శ్రేణుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నగరంలో ఏ నేతను ఎగదనివ్వటం లేదని రాజాసింగ్ బాహాటంగా వ్యాఖ్యానించటం పలు నేతలను ఆలోచనలో పడేశాయి. పైగా తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే కాంగ్రెస్ నేత మధుగౌడ్‌ను బిజెపిలోకి తీసుకువచ్చారని, గోషామహల్ నియోజకవర్గానికి వస్తే మధుగౌడ్ కబ్జాలు ఏమిటో చూపిస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కిషన్‌రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌కు కూడా ఆయన లేఖలు రాయటం నగర బిజెపి పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతటితో ఆగని రాజాసింగ్ కిషన్‌రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో ఎవర్ని నియమించాలన్న విషయంపై కూడా స్పష్టత ఇచ్చేలా ముగ్గురు, నలుగురు నేతల పేర్లను ప్రస్తావించటం పార్టీ శ్రేణుల్లో తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపుతోంది. అంతేగాక, ఎన్నికలు ముగిసి 16 నెలలు గడుస్తున్నా, రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కిషన్‌రెడ్డి ఎపుడైనా నగర ఎమ్మెల్యేలతో చర్చించారా? అంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను నగరానికి చెందిన కొందరు బడా నేతలు పరోక్షంగా సమర్థిస్తున్నారు. 16 నెలల క్రితం వరకు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీలో, టిడిపిల్లోనూ విబేధాలు భగ్గుమంటున్న తరుణంలో మజ్లిస్‌తో పొత్తును పెట్టుకునేందుకు తెరాస చేస్తున్న ప్రయత్నాలు పరోక్షంగా బిజెపి బలపడేందుకు తోడ్పడుతుందని భావించిన కమలనాధులకు తాజాగా తెరపైకొచ్చిన కిషన్‌రెడ్డి, రాజాసింగ్ విభేధాలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఇదే తరహాలో అధినాయకుల తీరుపై అలకవహించిన నేతలెందరో వౌనంగా రాజకీయాలకు దూరం అయ్యారే తప్ప, బిజెపిలో రాజాసింగ్ మాధిరిగా ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిగాపై తిరుగుబాటు ప్రకటించటం చాలా అరుదు. ఎంతో ధైర్యం చేసి సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు రాసిన లేఖలో ఏం రాశారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం రాజాసింగ్ లేఖను పరిగణలోకి తీసుకుంటుందా? ఎన్నికల వేళ ఈ ఇద్దరు నేతలను సముదాయించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతుంది? అంటూ పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా ఎదరుచూస్తున్నాయి.