హైదరాబాద్

5 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 5వ తేదీ నుంచి నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ ఎం.ప్రశాంతి సోమవారం పరీక్షల నిర్వాహణ, విద్యా, పోలీసు ఇతర విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పరీక్షలు పకడ్బందీగా, పారదర్శకంగ నిర్వహించేందుకు వీలుగా వివిధ విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అడ్వాన్సు పరీక్షలకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 105 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు, ప్రతి కేంద్రం వద్ద పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలీసులు తగిన బందోబస్తును చేపట్టనున్నట్లు వివరించారు. పరీక్షలకు సంబంధించి పరీక్షా పత్రాలను నగరంలోని పోస్ట్ఫాసుల్లో భద్రపరిచి అక్కడి నుంచి వివిధ పరీక్షా కేంధ్రాలకు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్లతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఎండాకాలం కావటంతో పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీటి సమస్య లేకుండా చూడాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. పరీక్షలు జరిగే రోజుల్లో నగరంలోని వివిధ రూట్లలో విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, వీటిని ఎగ్జామినేషన్ స్పెషల్ బస్సులుగా స్టిక్కర్లు వేసి నడిపించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు జెసి సూచించారు. ప్రశ్న పత్రాలు చేరవేసేంకు ఉపయోగించే వాహనాలకు కూడా ‘ఆన్ ఎగ్జామిషనే్స డ్యూటీ’ అనే స్టిక్కర్లు వేసి ఉపయోగించాలని సూచించారు. హైదరాబాద్ నగరలో ఈ పరీక్షలకు పూర్తి స్థాయిలో బందోబస్తు కల్పించాలని, పరీక్షా పత్రాలు తరలించే సమయంలో వాహనాలకు ఎస్కార్ట్స్ వెహికిల్ ఏర్పాటు చేయాలని, అలాగే పరీక్షలు జరిగే సమయంలో ఈ రకమైన వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డిఇవో రమేష్, విద్యుత్ శాఖకు చెందిన డి.రత్నయ్య, పోస్టల్ డిపార్ట్‌మెంట్ అధికారి ఎ.వి.ఆర్. విజయ్‌కుమార్, వైద్యశాఖ, ఆర్టీసి శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
టిఎస్‌పిఎస్సీ పరీక్షలకు
ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలి
గురుకుల పాఠశాలలో టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్న పరీక్షల నిర్వాహణపై అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని పరీక్షల చీఫ్ కోఆర్టినేటింగ్ ఆఫీసర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.ప్రశాంతి ఆదేశించారు. అధికారులంతా తమకు కేటాయించిన బాధ్యతలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వర్తించాలని కూడా సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో టిఎస్‌పిఎస్సీ పోస్టు గ్రాడ్యుయేట్ టీచరు(పిజిటి), ట్రైయినింగ్ గ్రాడ్యుయేట్ టీచర్(టిజిటి), ఫిజికల్ డైరెక్టర్(పిడి) పోస్టు నియామకానికి ఈ పరీక్షలను ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పనె్నండున్నర గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం పదివేల 811 మంది అభ్యర్థులు రాసే ఈ పరీక్షలకు గాను నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇరవై పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్షకు హజరుకానున్న అభ్యర్థులు తమతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మోబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, పెన్‌డ్రైవ్, వాచీలు, క్యాలికులేటర్లు, పర్సులు, నోట్సులు, చాట్స్ ఇతర రికార్డింగ్ పరికరాలు తీసుకురావద్దని, ఇవన్నీ కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఒక వేళ అభ్యర్థుల వద్ద పైన పేర్కొన్న పరికరాల్లో ఏ ఒక్కటి కన్పించినా, వారిని పరీక్ష నుంచి డిబార్ చేయనున్నట్లు తెలిపారు. ఫలితంగా వారు భవిష్యత్తులో కూడా సర్వీసు కమిషన్ ఇతర పరీక్షలకు అనుమతించటం జరగదని జెసి వివరించారు. పరీక్ష కంటే ముందుగా అభ్యర్థులు బయోమెట్రిక్‌ను నమోదు చేసుకోవల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను కూడా ముందుగానే చూసుకుని వివరాలను తెలుసుకోవాలని అన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించటం జరగదని జెసి స్పష్టం చేవారు.