హైదరాబాద్

ప్రాణహిత చేవెళ్ల ఎవరి కోసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయానికి నీటిని అందించేందుకు తొమ్మిదేళ్ల క్రితం ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఈ నెల 10 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్ చేసింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం శే్వతప్రతం జారీ చేయాలని సంబంధిత అధికారులను కోరినా, అందుకు వారు నిరాకరించటంతో ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు ప్రజలకు తెలియజేసేందుకు అసెంబ్లీలో చర్చ ఎంతో ముఖ్యమని ఫోరం అధ్యక్షులు జస్టిస్ రెడ్డపరెడ్డి, కార్యదర్శి పద్మనాభరెడ్డిలు వివరించారు. మంగళవారం ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో చర్చ జరగాల్సిన పది అంశాలను వెల్లడించారు. చేవెళ్ల ప్రాణహితల మధ్య 250 కిలోమీటర్ల దూరం ఉన్నా, పనులు ప్రారంభించిన నాటి నుంచి పనులు, డిజైనింగ్ అంతా కూడా అయోమంగా మారిందని, దీనిపై ప్రజల్లో నెలకొన్న అనేక రకాల అపోహలను తొలగించేందుకు చర్చ జరగాల్సిందేనని పద్మనాభరెడ్డి వ్యాఖ్యానించారు.
చర్చ జరగాల్సిన అంశాలు
* వ్యాప్‌కోస్ వారి సర్వే రిపోర్టుల ప్రకారం ప్రాణహిత నదిపై ఆనకట్ట అవసరం లేదు. చిన్న డైవర్షన్ స్ట్రక్చర్ సరిపోతుందని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నా, 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మించే అవసరమేమిటీ?
* సర్వే రిపోర్టు ప్రకారం ఇపుడు 160 టిఎంసిల నీరు లభ్య ఉన్నా, మున్ముందు 110 టిఎంసిల నీరు మాత్రమే లభ్యమయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేల కోట్ల పెట్టుబడి వృథా అవుతోంది.
* ప్రాణహిత ప్రాజెక్టుకు ఏడు డైరెక్టరేట్‌లు.మూడు మంత్రుల శాఖలు, ఒక బోర్డుతో పాటు మరో పదకొండు కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు అవసరం. గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రయత్నించగా, ఇప్పటి వరకు ఆరు శాఖల నుంచి మాత్రమే అనుమతులొచ్చాయి. ఇపుడు పునరాకృతి పేరుతో చేపట్టిన అయిదు ప్రాజెక్టులకు అనుమతులు ఎపుడొస్తాయి?
* ఒకవేళ ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి 40వేల కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయటం సాధ్యమేనా? అన్న అంశంపై చర్చ అవసరం
* ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరానికి నీరు ఇవ్వడానికి సుమారు రూ. 5లక్షలు ఖర్చవుతోంది. అలాగే ఎత్తిపోతలకు అయ్యే విద్యుత్ బిల్లు ఎకరానికి ఏటా రూ. 15వేల వరకు ఖర్చయ్యే అవకాశముంది. ఈ డబ్బు రైతు లనుంచి వసూలు చేసే పరిస్థితి కూడా లేదు. ఈ పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వెచ్చిస్తారు.
* ఎత్తిపోతలకు సుమారు 2525 మెగావాట్ల విద్యుత్ అవసరం, ఇది ఎక్కడి నుంచి వస్తుంది.
* ఈ ప్రాజెక్టుకు 3331 హెక్టార్ల అటవీభూములు అవసరం, ఇప్పటి వరకు 2028 హెక్టార్లు కాంపెన్‌సెటరీ అషాస్ట్రేషన్ భూమి మాత్రమే గుర్తించడం జరిగింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు మొదటి దశ అనుమతి కూడా ఇవ్వలేదని అటవీ శాఖ బహాటంగానే చెబుతోంది.
* 2007లో ప్రాజెక్టు పనులు మొదలుపెట్టినపుడు మొత్తం 28 ప్యాకేజీలుగా విభజించి ఏడు ప్యాకేజీలుగా రూ. 5983 కోట్లతో కేవలం రంగారెడ్డి జిల్లాలో మొదలుపెట్టారు. పనులు మొదలుకాక ముందే నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్లకు రూ. 1485 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇవ్వడటం జరిగింది. ఇందులో నుంచి సుమారు రూ. 567 కోట్ల అడ్వాన్స్‌లు ఎటువంటి పనులు జరగక ఇప్పటికీ కాంట్రాక్టర్ల దగ్గరే ఉంది. ప్రాజెక్టు పనులు మొదలుపెట్టక ముందే కాలువల పనులను చేవేళ్ల నుంచి ప్రాణహిత వైపు మొదలు పెట్టారు. ఈ రెండింటి మధ్య దూరం 250 కి.మీ.లు ఉంటుంది. ఇది కేవలం కొందరు కాంట్రాక్టర్లకు ఆర్దికంగా లబ్ది చేకూర్చే పనేనన్న అనుమానం లేకపోలేదు. ఇపుడు పునరాకృతి చేవెళ్లకు కాలువ పోవటం లేదు. దాంతో ఇంతవరకు తవ్విన కాలువలు, సొరంగాలకు అయిన సుమారు రూ. 3వేల కోట్ల ప్రజాధనం వృధా అవుతోంది.

* పునరాకృతి పేరుతో సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవటం, దానికి ఇంజనీర్లు ఆమోదం తెలపటం జరుగుతోంది. శాస్ర్తియ పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవటం లేదన్న విషయం తేలిపోయింది.

* ఈ ప్రాజెక్టు ద్వారా లభించే మొత్తం 160 టిఎంసిల నీటిలో 56 టిఎంసిలు తాగునీరు, పరిశ్రమలకు పోనూ మిగిలిన 104 టిఎంసిల నీరు 10లక్షల ఎకరాలకు కూడా సరిపోదు. చెలక, ఇసుక భూములలో ఒక టిఎంసి నీరు పదివేల ఎకరాలకు మాత్రమే సరిపోతోంది.