హైదరాబాద్

పాతబస్తీలో రోడ్ల విస్తరణ సమస్యల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: పాతబస్తీలో జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి మంగళవారం విస్త్రృతంగా పర్యటించారు. మలక్‌పేట, చాంద్రాయణగుట్ట నియోకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ రవాణా, రోడ్డు విస్తరణ వంటి అంశాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు. అనంతరం ఆయన ఎమ్మెల్యేలు, జిహెచ్‌ఎంసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. చాంద్రాయణగుట్ట శాసన సభ్యులు అక్బరుద్ధీన్ ఓవైసి, మలక్‌పేట ఎమ్మెల్యే బలాలాతో పాటు జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో కలిసి సమస్యలపై చర్చించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఓవైసి ఆసుపత్రి వద్ద రోడ్డు విస్తరణ, చంచల్‌గూడ జైలు సమీపంలోని ప్రధాన రహదారి విస్తరణ చేపట్టేందుకు వెంటనే తగిన ప్రతిపాదనలు సమర్పించాలని కమిషనర్ టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మలక్‌పేట జంక్షన్ వద్ద ప్రస్తుతమున్న రైల్వే స్టేషన్‌తో పాటు మెట్రోరైలు స్టేషన్ తదితర నిర్మాణాలున్నందున మలక్‌పేటలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని మలక్‌పేట ఎమ్మెల్యే బలాలా చేసిన ప్రతిపాదనలను కమిషనర్ పరిశీలించారు. మలక్‌పేట రేస్‌కోర్టు రోడ్ నుంచి గోల్నాక వరకు రోడ్డు విస్తరణ చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశళించారు. చంచల్‌గూడ సమీపంలోని బీంరావుబాడాలో నిరుపేదలకు నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పురోగతిని కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ తర్వాత రాజేంద్రనగర్ సర్కిల్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు.
22న జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రంగారెడ్డి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశే్వశ్వర్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 22న ఉదయం 11 గంటలకు రాజేంద్రనగర్‌లోని టిఎస్- ఐపాడ్‌లో నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రప్రభుత్వ నిధుల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపిపిలు, సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.