హైదరాబాద్

బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా మహిళలు జరుపుకునే బతుకమ్మ పండుగకు జిహెచ్‌ఎంసి ఏర్పాట్లు చేస్తోంది. మహిళలు సామూహికంగా బతుకమ్మ ఆడునేందుకు వేదిక కానున్న ట్యాంక్‌బండ్‌ను ప్రత్యేకంగా అలంకరించేందుకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. అంతేగాక, ఈ నెల 26వ తేదీన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎల్‌బి స్టేడియంలో సుమారు 30వేల మందితో బతుకమ్మ ఆడి, మరో అరుదైన రికార్డును సృష్టించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందుకు హజరయ్యేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. గత సంవత్సరం జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో ఇదే స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ గిన్నీస్ రికార్డును సాధించిన సంగతి తెలిసిందే! ఈ సారి 30వేల మంది మహిళలతో బతుకమ్మ ఆడి, మరో అరుదైన రికార్డును సాధించేందుకు తెలంగాణ జాగృతి ఏర్పాట్లు చేస్తోంది. అంతేగాక, జిహెచ్‌ఎంసి యుసిడి ఆధ్వర్యంలో ఎల్‌బి స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు మహిళలు బృందాలుగా బతుకమ్మ ఆడేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లపై జిహెచ్‌ఎంసి కాస్త ముందు నుంచే దృష్టి సారించింది. ఈ కార్యక్రమానికి మహిళలు, పిల్లలు ఎక్కువ సంఖ్యలో హజరయ్యే అవకాశమున్నందున రోడ్డుకిరువైపులా ప్రస్తుతమున్న వీది ధీపాలకు మరమ్మతులు చేయటంతో పాటు అవసరమైన చోట అదనంగా లైట్లను ఏర్పాటు చేసేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక, బతుకమ్మ ప్రాముఖ్యత, విశిష్టతను తెలియజేసేందుకు గాను నగరంలోని పలు కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో గత సంవత్సరం మాదిరిగా ఈ సారి కూడా బతుకమ్మ ఆకృతులను ఏర్పాటు చేయనున్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్‌ను సిద్దం చేశారు. ఈ ఘాట్ చుట్టూ మంచినీరు ఉండేలా చర్యలు చేపట్టారు. బుధవారం నుంచి బతుకమ్మ ఆటలు ప్రారంభమవుతున్నందున ఈ ఘాట్‌కు మరమ్మతులు చేపట్టారు. మహిళలు ఎక్కువగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కూడా అప్రమత్తంగా ఉంటూ పోకిరీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు మఫ్టీ పోలీసులను రంగంలో దింపనున్నట్లు తెలిసింది.
కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ
బతుకమ్మ పండుగకు ఈ సారి ప్రభుత్వం నజరానాగా ప్రకటించిన బతుకమ్మ చీరల పంపిణీ నగరంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. జిహెచ్‌ఎంసి గుర్తించిన కమ్యూనిటీ హాళ్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ చీరల పంపిణీ కొనసాగుతోంది. పంపిణీ సజావుగా జరిగేందుకు వీలుగా జిహెచ్‌ఎంసి అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీలను సైతం నియమించారు.