హైదరాబాద్

హెల్మెట్ లేకుంటే జైలుకే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఇప్పటివరకు నగరంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన 40 వేల మందిపై కేసులు నమోదు చేశామని నగర ట్రాఫిక్ విభాగం-2 డిసిపి ఎవి.రంగనాథ్ తెలిపారు. పాతబస్తీ చార్మినార్‌లో బుధవారం సాయంత్రం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన ట్రాఫిక్ అదనపు డిసిపి ఎస్.సత్యనారాయణ, చార్మినార్ ఏసిపి జె.్భద్రేశ్వర్‌లతో కలిసి మాట్లాడారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల మేరకు మార్చి 1నుండి ద్విచక్ర వాహనాదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని డిసిపి తెలిపారు. మొదటి దఫాకింద హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై వంద నుండి రెండు వందల రూపాయల వరకు చలాన్లను విధిస్తున్నామని, తర్వాత కూడా హెల్మెట్ లేకుండా బండి నడిపితే వాహనాదారుడికి ఒకరోజు జైలు శిక్ష విధిస్తారని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు నగరంలో గత అక్టోబర్ మాసం నుండి ద్విచక్రవాహనాదారులు తప్పకుండా హెల్మెట్లు ధరించాలని నగర పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం, అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలను నడుపుతున్న వారి సంఖ్య పాతబస్తీలోని దక్షిణ మండలం, ఈస్ట్‌జోన్ తదితర ప్రాంతాల్లో అధికంగా ఉందన్నారు. మలక్‌పేట్, చార్మినార్, చాదర్‌ఘాట్, ఫలక్‌నుమా, మీర్‌చౌక్, మోహిదీపట్నం తదితర ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న దాదాపు పదివేల మందిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ట్రాఫిక్ పోలీసులకు వాహనాదారులు సహకరించి తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ ధరిస్తే వాహనాదారుడికి అనేక రకాలుగా మేలుకలుగుతుందన్నారు. ఈ మేరకు సినీనటులు, సెలబ్రిటీలతో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ప్రతి వాహనాదారుడు తప్పుకుండా హెల్మెంట్ ధరించాలని అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించామన్నారు. నగరంలో వాహనాలు నడుపుతున్న వారు అనేకమందికి లైసెన్స్‌లు లేవని, అలాంటి వారు తప్పకుండా లైసెన్స్‌లను పొందాలని, ప్రస్తుతం లెర్నింగ్ లైసెన్స్ ఉన్న వారికి ఎలాంటి చలాన్ విధించకుండా వెసులుబాటు కలిగించామని ఆయన తెలిపారు. ప్రధానంగా నెంబర్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతూ అనేక మంది పాతబస్తీలో వాహనాలు నడుపుతున్నారని అలాంటి వారు తనిఖీల్లో దొరికితే ఏమాత్రం ఉపేక్షించేది లేదాన్నారు. కోర్టు ఉత్తర్వులను గౌరవించి ప్రతి వాహనాదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఆయన కోరారు. తనిఖీల్లో పట్టుబడి జైలు పాలైన వారిలో విద్యార్థులు ఉంటే అలాంటి వారి పాస్‌పోర్టులను సైతం సీజ్ చేస్తామని, వారు ఒక వేళ విదేశాలకు వెళ్లాలనుకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. లైసెన్స్‌లు లేనివారి కోసం ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించి ఆటోలో అధికంగా విద్యార్థులను తీసుకువెళుతున్న వారిపై నిఘాను ముమ్మరం చేశామని, కెపాసిటీ మించి విద్యార్థులను తీసుకెళ్లడం ద్వారా అనేక సమస్యలతో పాటుకొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఆసుపత్రుల పాలైన సంఘటనలు నగరంలో ఉన్నాయని, ఇకపై ఆటోడ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని, ఆటోడ్రైవర్లతో కూడా త్వరలో సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో తమ పేర్లపై ఉన్న బైక్ యాజమానులు అమ్మినా, కొనినా వెంటనే సంబంధిత ఆర్టీఎ కార్యాలయాల్లో పేర్లను వెంటనే మార్చుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఫలక్‌నుమా, మీర్‌చౌక్, చార్మినార్ ఇన్‌స్పెక్టర్లు బి.చంద్రకుమార్, కె.నరహరి, లింగయ్య పాల్గొన్నారు.