హైదరాబాద్

అక్రమాలకు వెంటనే అడ్డకట్ట వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: జిహెచ్‌ఎంసి వాహనాల మరమ్మతులకు సంబంధించిన రవాణా విభాగంలో అవకతవకలు, అక్రమాలకు వెంటనే అడ్డకట్ట వేసి, అందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఊదరిగోపాల్ డిమాండ్ చేశారు. మలక్‌పేట్ జైల్ గార్డెన్స్‌లో యార్డులో సప‘రేటు’ విధానం కొనసాగుతుండటంతో, కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఉభయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యార్డులో డిఈగా పనిచేస్తున్న శ్రీనివాస్‌చారి ఫోర్జరీ సంతకాలతో అనేక ఇండెంట్లు రూపొందించి, కోట్లాది రూపాయలను కొల్లగొట్టారని వారు ఆరోపించారు. అంతేగాక, కాలం చెల్లిన, మూలనపడేసిన జిహెచ్‌ఎంసికి చెందిన పాతకాలపు వాహనాల విడిభాగాలను రన్నింగ్‌లో ఉన్న ఇతర వాహనాలకు భిగించిన ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఒకవైపు జిహెచ్‌ఎంసి కార్పొరేషన్‌కు చెందిన ట్యాక్సు, ట్రేడ్ లైసెన్సులకు చెందిన ఉద్యోగులు ఎంతో పని వత్తిడిని ఎదుర్కొంటూ కార్పొరేషన్‌కు కోట్లా రూపాయాల్లో ఆదాయాన్ని సమకూరుస్తుంటే, ఈ రకంగా అక్రమాలు జరుగుతూ నిధులు దుర్వినియోగం కావటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు ఆరోపించారు. ఇదే వ్యవహారంపై వారం రోజులు క్రితం కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా, చర్యలేమీ తీసుకోకపోవటం వల్లే తాము ఈ రకంగా ఆందోళనకు దిగాల్సిన అవసరమేర్పడిందని గోపాల్ వ్యాఖ్యానించారు. ఇరవై నెలల క్రితం రవాణా విభాగంలో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విభాగాన్ని జోన్ల వారీగా వికేంద్రీకరణ చేసిన, తర్వాత వాహనాల సంఖ్య గణనీయంగ తగ్గినా, ఖర్చు మాత్రం రెండింతలు కావటం పట్ల ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరముందని, లేని పక్షంలో తమ ఆందోళనను ఉద్దృతం చేస్తామని గోపాల్ వ్యాఖ్యానించారు. మరో కార్మిక సంఘం నేత కె. అమరేశ్వర్ మాట్లాడుతూ మలక్‌పేట యార్డులో వాహనాలకు భిగించేందుకు సామాగ్రిని కొనుగోలు చేసే విషయమై తమ సంతకాలు తీసుకోవటం లేదని, ఇక్కడ మోసపూరితమైన విధానం కొనసాగుతుందన్నారు. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేసి, కార్పొరేషన్ నిధులను కాపాడాలని ఆయన కోరారు. కార్మిక నేతల ఆందోళన విషయం తెలుసుకుని అదనపు కమిషనర్( ఆరోగ్యం, పారిశుద్ద్యం) రవికిరణ్ వారి వద్దకు వచ్చి చర్చలు జరిపిన తర్వాత వారు ఆందోళనను విరమించారు. ఈ ధర్నాలో జిహెచ్‌ఎంఈయు నేతలు ఎం.ఎ. జబ్బార్, నజీరుద్దిన్, జగదీష్, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.