హైదరాబాద్

హోంగార్డుల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్ తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 22: అసెంబ్లీ సమావేశాల్లో హోంగార్డుల సమస్యలపై చర్చించి, క్రమబద్ధీకరణకు ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని హోంగార్డుల ప్రతినిధి, న్యాయవాది శారద గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. వారం రోజుల్లో హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి దానిని మరిచిపోయారని విమర్శించారు. పోలీస్‌శాఖలో అత్యంత దుర్భరమైన జీవితాలు వెల్లదీస్తున్న హోంగార్డుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సమైక్య రాష్ట్రంలో తమ గోడు వినేవారు లేరని ఆవేదన చెందిన హోంగార్డులకు స్వరాష్ట్రంలోనూ చేదు అనుభవమే ఎదురు అవుతుందని అన్నారు. ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలు, అధికారుల వేధింపులు, కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆర్ధిక ఇబ్బందులతో హోంగార్డులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా హోంగార్డుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, ఇతర శాఖల్లోలా మెటర్నిటీ లీవులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక ఆర్డినెన్సును తీసుకువచ్చి హోంగార్డులను క్రమబద్ధీకరించి వారీ జీవితాల్లో వెలుగులు నింపాలని డిమాండ్ చేశారు.

‘మేడమ్ కథలు’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, అక్టోబర్ 22: ప్రముఖ రచయిత్రి డా.ముక్తేవి భారతి రచంచిన ‘మేడమ్ కథలు’ పుస్తకావిష్కరణ సభ సినారె - వంశీ విజ్ఞాన పీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముక్తేవి భారతి మేడమ్ కథలు వాస్తవాలకు అద్దంపడుతాయని తెలిపారు. ముక్తేవి భారతి అన్ని ప్రక్రియాల్లో రచనలు చేశారని పేర్కొన్నారు. సాహితీ కిరణం మాస పత్రిక సంపాదకుడు పొత్తూరి సుబ్బా రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, భీమన్న సాహితీ నిధి అధ్యక్షురాలు హైమవతి భీమన్న, ఆచార్య శరత్ జోత్న్సారాణి, రచయిత్రులు డా.సి.్భవాని దేవి, డా.శోభాపేరిం దేవి, డా.తెనే్నటి సుధాదేవి పాల్గొన్నారు. సభకు ముందు కిడాంబి రఘునాథన్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మధుర గాయనీ సుచిత్ర బృందం అలపించిన సినీ సంగీత విభావరి అందరిని అలరించాయి.