హైదరాబాద్

అంబర్‌పేట ఫ్లైఓవర్‌కు లింక్‌గా మరో కారిడార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం జిహెచ్‌ఎంసి అందుబాటులో ఉన్న అన్ని చోట్ల వంతెనలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా ఇప్పటికే డిజైన్లు ఖరారై రేపోమాపో పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న అంబర్‌పేట ఫ్లై ఓవర్‌కు అనుసంధానంగా రూ.వెయ్యి కోట్ల వ్యయంతో 500 మీటరు పొడవు కల్గిన మరో వంతెనను నిర్మించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఇప్పటికే అంబర్‌పేట ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఉభయ వర్గాలకు చెందిన ప్రార్థన మందిరాలు, శ్మశానవాటికలు అడ్డుగా మారటంతో గుజరాత్ రాష్ట్రంలో తరహా స్ప్లిట్ టెక్నాలజీతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించేందుకు రోడ్ల, భవనాల శాఖ కసరత్తు చేస్తోంది. అయితే ఈ అంబర్‌పేట ఫ్లై ఓవర్‌తో అంబర్‌పేట క్రాస్‌రోడ్డు, గోల్నాక, రామంతాపూర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నుంచి ఆశించిన స్థాయిలో ఉపశమనం కలిగే అవకాశం లేదన్న విషయాన్ని గ్రహించిన జిహెచ్‌ఎంసి అధికారులు రామంతాపూర్ నుంచి అంబర్‌పేట వరకు మరో ఫ్లై ఓవర్‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీన్ని అంబర్‌పేట ఫ్లై ఓవర్‌కు అనుసంధానం చేస్తే ట్రాఫిక్ వేగంగా ముందుకు కదిలే అవకాశమేర్పడి, ట్రాఫిక్ జాం వంటి సమస్యలకు తెర పడనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. రామంతాపూర్‌లో నిర్మించనున్న సరికొత్త వంతెనను ఈ అంబర్‌పేట ఫ్లై ఓవర్‌కు సాలేం బైబిల్ చర్చి వద్ద లింకు చేసి, అంబర్‌పేట మార్కెట్ మీదుగా నిర్మించి, అంబర్‌పేట ముఖరం హోటల్ వద్ద వరకు కొనసాగేలా అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు ఉప్పల్ జంక్షన్ నుంచి ఘట్‌కేసర్ వరకు నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ కారిడార్ వేకు ఈ రెండు ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్ తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశముంది. నాలుగు లేన్లుగా నిర్మించనున్న ఈ రామంతాపూర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 40 ఎకరాల స్థలాన్ని సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఉప్పల్, అంబర్‌పేటల మధ్య ట్రాఫిక్ మరింత సజావుగా సాగేందుకు వీలుగా కాస్త ఎత్తులో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతిపాదనలను సర్కారుకు పంపాలని అధికారులు భావిస్తున్నారు.
ట్రా‘ఫికర్’!
పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్‌తో గందరగోళం * ప్రధాన కూడళ్లు, విఐపి జోన్‌లోనూ అదే తంతు * పరుగులు పెడుతున్న పోలీసులు * అటు అసెంబ్లీ సమావేశాలు.. స్పీడందుకొన్న మెట్రో పనులతో ట్రాఫిక్ అస్తవ్యస్తం

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం పరిస్థితి పేరుగొప్ప ఊరు దిబ్బలా తయారైంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయటంలో ముందుంటున్న పోలీసులు.. అసెంబ్లీ సమావేశాల సమయంలో ట్రాఫిక్ ఆంక్షలను మాత్రం పక్కాగా అమలు చేస్తున్నారు. కాగా, పోలీసులు సక్రమంగా పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్‌కు కనీసం మరమ్మతులు కూడా చేయించటం లేదు. ఫలితంగా పలు బిజీ కూడళ్లలో వాహనాల రాకపోకలు అయోమయం, గందరగోళంగా తయారయ్యాయి. కారణంగా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం లేకపోలేదు. మరోవైపు నగరంలోరోజురోజుకీ ట్రాఫిక్ సమస్య మరింత జటిలవౌతోంది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు విఐపి జోన్‌లోని అసెంబ్లీ, సచివాలయం ముందున్న సిగ్నల్స్‌తో పాటు నిత్యం రద్దీగా ఉండే మాసాబ్‌ట్యాంక్, ఖైరతాబాద్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, ప్యాట్నీ సెంటర్ వంటి కూడళ్లలో కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కొన్నిసార్లు పనిచేయటం లేదు. అసెంబ్లీ ముందున్న ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నట్టుండి మొరాయించటంతో పక్కనే విధి నిర్వహణలో ఉన్న పోలీసులు పరుగులు తీసి, వాటిని మాన్యువల్‌గా ఆపరేట్ చేయాల్సిన దుస్థితి నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ఓ వైపు జరుగుతున్నా ట్రాఫిక్ సమస్య అలానే ఉంటోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా పనిచేయకపోవటం, ఉన్నట్టుండి మొరాయిస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. మెట్రోరైలు పనులు వేగవంతం కావటంతో ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షల అమలు.. మరోవైపు సక్రమంగా పనిచేయని సిగ్నల్స్ కారణంగా ట్రాఫిక్ నియంత్రణ అధికారులకు తలనొప్పిగా మారింది. సిగ్నల్స్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు పరుగులు తీసి, మాన్యువల్‌గా ఆపరేట్ చేసిన సందర్భాలు సచివాలయం ముందున్న సిగ్నల్స్ వద్ద అనేకం ఉన్నాయ. రౌండ్ ది క్లాక్ ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసులకు సకల సౌకర్యాలు కల్పించిన సర్కారు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ముఖ్యమైన సిగ్నల్స్‌పై దృష్టి సారించకపోవటం శోచనీయం. నగరంలోని విఐపి జోన్ పరిధిలోని సచివాలయం ముందు, అసెంబ్లీ ముందు, అంబేద్కర్ విగ్రహం వద్ధ, లక్డీకాపూల్ చౌరస్తా, మాసాబ్‌ట్యాంక్, నాంపల్లి చౌరస్తా వంటి ప్రధాన కూడళ్లలో సైతం నిత్యం ట్రాఫిక్ సిగ్నల్స్ మొరాయిస్తున్నాయి. గ్రేటర్ అధికారులు, మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన బృందం ట్రాఫిక్ నియంత్రణపై ముంబై నగరంలో చేసిన అధ్యయన నివేదికలు బుట్టదాఖలైనట్లు విమర్శలొస్తున్నాయి. ఇక అసెంబ్లీ సమావేశాల కారణంగా ట్రాఫిక్ పెరగడంతో పోలీసులు రవీంద్రభారతి, పాత కంట్రోల్ రూం ముందున్న సిగ్నల్స్ వద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ట్రాఫిక్ చిక్కులు చక్కబడేదెన్నడో అని సామాన్యుడు సతమవుతున్నాడు.