హైదరాబాద్

టిఆర్‌ఎస్‌లోనే ఉంటా.. తాండూరు నుండే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, నవంబర్ 12: రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా ప్రజాసేవకు అంకితమైన కింది స్థాయి ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపిటిసిలు,మున్సిపల్ కౌన్సిలర్‌లకు ప్రభుత్వం చేయూతను ఇచ్చి వారి జీవన భృతికి గౌరవ వేతనం అందించి ఆదుకోవాలని ప్రజా తెలంగాణ యంగ్ లీడర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర యువనేత పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని మినీ భూ కైలాస్ ఫంక్షన్ హాల్ మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్‌ల సదస్సును ఉద్దేశించి రోహిత్ రెడ్డి మాట్లాడారు.
రాష్టవ్య్రాప్తంగా క్షేత్ర స్థాయిలో గ్రామాల సర్పంచులుగా, ఎంపిటిసిలుగా, మున్సిపల్ కౌన్సిలర్‌లుగా ప్రజలకు సేవలు అందించిన ప్రజాప్రతినిధులు నేడు ఎలాంటి రాజకీయ అండదండలు లేకపోవడంతో దుర్భర జీవితాలను గడుపుతున్నారని తెలిపారు. తాము చేపట్టే కార్యక్రమానికి రాజకీయ రంగు పులుముతూ కొందరు అవకాశవాద రాజకీయులు తనను టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు అభివర్ణించటం వారి అవగాహనారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలుగా పని చేసిన పెద్దలకు ఆయా ప్రభుత్వాలు గౌరవ వేతనం కింద వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని గుర్తుచేశారు. కింది స్థాయిలో గ్రామాల్లో ఎంతో కాలం ప్రజా సేవకు అంకితమైనవారకి రూ.3వేల నుండి రూ.6వేల వరకు గౌరవ వేతనంగా ప్రభుత్వం అందించి ఆదుకోవాలన్నదే తమ ఆశయం అని తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధుల అభ్యున్నతికి జిల్లాల వారీగా ప్రజా తెలంగాణ యంగ్ లీడర్స్ ఫౌండేషన్ సంస్థ ద్వారా సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 31 జిల్లాల సదస్సుల అనంతరం హైదరాబాద్‌లో భారీ సదుస్సును నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన సదస్సులో దాదాపు 1500 మంది మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొని తమకు యంగ్ లీడర్స్ ఫౌండేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. యంగ్ లీడర్స్ పౌండేషన్ నాయకులు మురళీ గౌడ్, విజయ కుమార్ పాల్గొన్నారు.

గ్రంథాలయాల్లో మెరుగైన సేవలకు పాఠకులు సూచనలు, సలహాలివ్వాలి
* కొండల్‌రెడ్డి పిలుపు
వికారాబాద్, నవంబర్ 12: జిల్లాలోని గ్రంథాలయాల్లో మెరుగైన సేవలందించేందుకు పాఠకుల సూచనలు, సలహాలు స్వీకరించి అమలు చేస్తామని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ సనగారి కొండల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వారోత్సవాల ప్రారంభోత్సవానికి శాసనసభ్యుడు బి.సంజీవరావు, ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి, 15న పుస్తక ప్రదర్శన ప్రారంభానికి జిల్లా కలెక్టర్ దివ్య హాజరవుతారని చెప్పారు. జిల్లాలో 17 శాఖా గ్రంథాలయాలు, రెండు గ్రామ గ్రంథాలయాలు, 84 పుస్తక నిక్షిప్త కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. 15 గ్రంథాలయాలకు సొంత భవనాలుండగా, ఒకటి ఉచిత, రెండు అద్దె భవనాలున్నాయని అన్నారు. గ్రామ గ్రంథాలయాల్లో ఒకటి స్వంత, ఒకటి ఉచిత భవనాలున్నాయని వివరించారు. జిల్లాలో మూడు లక్షలకుపైగా పుస్తకాలున్నాయని, 12765 మంది సభ్యులున్నారని, పాఠకుల సంఖ్య ఐదు లక్షలకుగా పైగా ఉన్నారని, ఈసంవత్సరం ఉపయోగించిన పుస్తకాలు 21.26 లక్షలని తెలిపారు. పాఠకుల సౌకర్యార్థం కేవలం రూ.10 చార్జీతో ఇంటర్నెట్ విభాగం నడుస్తోందని, మరో ఆరు కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నామని, డిజిటల్ చేయబడిన పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రూప్-1, 2 పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అధ్యాపకులను నియమిస్తామని, స్పోకన్ ఇంగ్లీష్‌పై సైతం శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. పాఠకుల సంఖ్య పెరిగిన దరిమిలా వసతులు, సౌకర్యాలను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రంథాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని అందులో భాగంగానే పాత భవనాలైన వికారాబాద్, సూర్యాపేట జిల్లా గ్రంథాలయాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 18 సొంత భవనాల్లో 17 శిథిలావస్థకు చేరాయని, నవాబ్‌పేట గ్రంథాలయానికి ఐదు లక్షలతో మరమ్మతు పనులు సాగుతున్నాయని అన్నారు. పాఠకులు అడిగిన 350 కొత్త పుస్తకాలు తెప్పించేందుకు కృషి చేస్తున్నామని, గ్రూప్ కోచింగ్‌కు వచ్చేవారు దఖాస్తు చేసుకోవాలని వివరించారు. జిల్లా గ్రంథాలయంలో పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యే ఐదు లక్షలు ఇస్తారని తెలిపారు. శాసనసభ్యుడు బి.సంజీవరావు మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాల్లోని పుస్తకాలు చదివి మంచి స్థానాల్లో నిలబడాలని ఆకాంక్షించారు. మార్కెట్ చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి, జడ్పీటీసీ ముత్తార్‌షరీఫ్, ఎన్.శుభప్రద్‌పటేల్ పాల్గొన్నారు.