హైదరాబాద్

గ్లోబల్ సమ్మిట్‌కు ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: గ్లోబల్ ఎంటర్ప్రెన్యుల్ సమ్మిట్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సమ్మిట్ ఏర్పాట్లపై బల్దియా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఈ సమ్మిట్‌కు ప్రదాని నరేంద్రమోదితో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక కూడా హాజరవుతున్నందున శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సమ్మిట్‌కు వేదికమైన హైటెక్స్ రూట్‌లో, అలాగే నగరం పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్‌లో మీదుగా హైటెక్స్ చేరుకునే మరో రహదారిపై అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మిట్ నేపథ్యంలో సుమారు రూ. 9.31 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పదిశాతం వరకు ఇప్పటికే పలు కార్పొరేట్ సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిహెచ్‌ఎంసి సమకూర్చకోంది. ఇప్పటికే ఈ రహదారులపై జరుగుతున్న ఏర్పాట్లను మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో పాటు పలుసార్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి సైతం క్షేత్ర స్థాయిలో సందర్శించి రహదారిని మెరుగుపరిచే అంశంపై ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నగర పోలీసులు నగరంలో భిక్షాటనను నిషేధించిన సంగతి తెలిసిందే! అంతేగాక, ఈ రూట్‌లో ఫుట్‌పాత్‌ను, బస్టాపులను కబ్జా చేసి వెలిసిన చిరువ్యాపారాలను బల్దియా అధికారులు తొలగిస్తున్నారు. అంతేగాక, రోడ్లకిరువైపులా ఎక్కడా కూడా భవన నిర్మాణ వ్యర్థాల్లేకుండా చూసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే భవన నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్డుపై వేసిన భవన నిర్మాణ సామాగ్రిని అక్కడి నుంచి తరలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్లపై ఎక్కా కూడా గుంతల్లేకుండా చర్యలు చేపట్టారు. సిగ్నల్ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేసేలా మరమ్మతులు చేస్తున్నారు. అలాగే రోడ్డుపై అన్ని రకాలుగా సైనేజీలను ఏర్పాటు చేస్తన్నారు. ఇక జిహెచ్‌ఎంసి కేటాయించిన రూ. 9.31 కోట్లలో రూ.5.54 కోట్లతో బిటి రోడ్డు నిర్మాణం, రూ. 2.27 కోట్లతో ఫుట్‌పాత్‌ల మరమ్మతులు, సుందరీకరణ పనులు చేపడుతుండగా, మరో రూః. 60లక్షలతో పచ్చదనాన్ని మెరుగుపర్చుతున్నారు. అలాగే రూ. 40 లక్షలతో వీధులు ఎంతో ఆకర్షణీయంగా కన్పించేలా పెయింటింగ్‌లను ఏర్పాటు చేస్తన్నారు. అలాగే పలు కూడళ్లు, మెయిన్‌రోడ్లు ఆకర్షణీయంగా కన్పించేందుకు వీలుగా రూ. 30లక్షలతో విద్యుత్ దీపాలంకరణ పనులను చేపట్టారు. ముఖ్యంగా వివిఐపిలను ఆకట్టుకునేలా రోడ్డు మధ్యలోని సెంట్రల్ మీడియన్‌లో ఆకర్షనీయంగా పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్నారు.