హైదరాబాద్

టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: తెలుగుదేశం పార్టీని కనుమరుగు చేయాలనుకునే నేతలే కనుమరుగైపోతాయరని టీడీపీ నగర అధ్యక్షుడు ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు అన్నారు. తెలుగుదేశం పార్టీని కెసిఆరే ఏమీ చేయలేకపోయారని, ఇక ఆయన కుమారుడు, మంత్రి కెటిఆర్ ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు. మంగళవారం టిడిపి సిటీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెటిఆర్ టిడిపిలోని చిన్నాచితక నేతలను తమ పార్టీలో కలుపుకుని, తెలంగాణలో టిడిపి పార్టీ కనుమరుగైపోయిందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న నమ్మకంతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండాను మోసేందుకు నాటి నుంచి నేటి వరకు వస్తున్న అంకితభావం కల్గిన నేతలు, కార్యకర్తలెవ్వరూ పార్టీని వీడలేరని ఆయన వివరించారు. ఇందుకు నిదర్శనమే గత మే నెలలో జరిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుకు హాజరైన కార్యకర్తల సంఖ్యే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా కొందరు పార్టీలు మారారని, మరికొంత మంది టిఆర్‌ఎస్‌లో చేరినా, టిడిపికి ఏం జరగలేదని ఎం.ఎన్ వివరించారు. ఎవరూ ఊహించని విధంగా గ్రామ స్థాయిలో ఒక కార్యకర్తో, నేతో పార్టీ మారితే ఒకరు వెళితే ఏం మేమున్నామంటూ పార్టీ జెండాను మోసేందుకు అనేక మంది కార్యకర్తలు ముందుకు రావటం నేటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనం అన్నారు. గత జీహచ్‌ఎంసీ ఎన్నికల్లో అవినీతి రహిత జీహెచ్‌ఎంసీగా తీర్చిదిద్దుతామని, నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామంటూ, ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ ఎన్నో రకాల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తామంటూ బూటకపు వాగ్దానాలు చేసి 99 సీట్లు గెలిచిన తర్వాత టిఆర్‌ఎస్ కార్పొరేటర్లలో ఇప్పటి వరకు పలువురి దిన చర్యలు, వారి అవినీతి అక్రమాలు, అధికారులపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా తెలంగాణలో రెండో స్థానం ఉన్న పార్టీ తెలుగుదేశమేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా, ఈ రోజు వరకు సిఎంకు గానీ, ఆయన తనయుడికి గాని మున్సిపల్ శాఖపై పట్టు రాకపోవటం వల్లనే పూర్తిస్థాయి మున్సిపల్ శాఖ విఫలమైందని ఎంఎన్ వ్యాఖ్యానించారు. సమావేశంలో టీడీపీ నేతలు వనం రమేశ్, పలుస బాలరాజ్‌గౌడ్, తెలుగు మహిళా అధ్యక్షురాలు షకీలారెడ్డి, అంజద్ అలీఖాన్, కప్పకృష్ణాగౌడ్, కోరెపు శ్రీహరి పాల్గొన్నారు.