హైదరాబాద్

వాడీ.. వేఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: స్వచ్ఛ హైదరాబాద్ పేరిట పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశామంటూ అధికారులు చేసుకుంటున్న ప్రకటనలపై గురువారం జరిగిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో రచ్చ జరిగింది. నగరంలోని దాదాపు అన్ని డివిజన్లలో వారానికోసారి చెత్త సేకరణ, తరలింపు వంటివి జరుగుతున్నాయని, గతంలో తామెన్ని సార్లు అధికారులకు మొరబెట్టుకున్నా, వారి పట్టించుకోవటం లేదని టీఆర్‌ఎస్, మజ్లీస్ పార్టీల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం పదకొండున్నర గంటలకు మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న పలు డివిజన్ల వార్డు కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగా జరిగింది. తొలుత సభ్యులు మనె్నకవితారెడ్డి, సింధు, పద్మావతి, గద్వాల విజయలక్ష్మి, ఆయేషా రుబీనా, నరేందర్‌చారిలు ప్రతిపాదిత వార్డు కమిటీ, ఏరియా సభ సభ్యుల పేర్లను సభలో ప్రవేశపెట్టగా, సభ్యులంతా ఆమోదించటంతో వీరి ఎన్నిక పూర్తయినట్లు మేయర్ ప్రకటించారు. కౌన్సిల్ సమావేశంలో మధ్యాహ్నాం ఒంటి గంట నుంచి ప్రారంభమైన ప్రశ్నోత్తరాల పర్వం దాదాపు రెండున్నర గంటల పాటు రసవత్తరంగా సాగింది. ఇందులో పారిశుద్ద్యం, రోడ్లు, రోడ్డు వెడల్పు పనులకు సంబంధించి సభ్యుల ప్రశ్నలకు కమిషనర్ జనార్దన్ రెడ్డి,చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రీ్ధర్, అదనపు కమిషనర్ రవికిరణ్‌లు సమాధానం చెప్పారు. సభలో ఎక్కువ సమయం పారిశుద్ద్యం స్వచ్ఛ ఆటో టిప్పర్ల పనితీరుపైనే చర్చ జరిగింది. సభ్యురాలు గిరిగంటి శ్రీదేవి స్వచ్ఛ ఆటో టిప్పర్ల కేటాయింపు, సక్రమంగా పనిచేయని ఆటో కార్మికులపై చర్యలకు సంబంధించిన ప్రశ్నను లేవనెత్తటంతో చర్చ మొదలైంది. ఆ తర్వాత ఇదే సమస్యపై కో ఆప్షన్ సభ్యుడు మహమూద్ హుస్సేన్, సలీంబేగ్, సామ రమణారెడ్డి, ఆయేషా రుబీనాలు మాట్లాడుతూ నగరంలో ఎటు చూసినా పారిశుద్ద్యం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. అహ్మద్‌నగర్ డివిజన్‌లో 13వేల ఇళ్లు, 40వేల పై చిలుకు ఓటర్లుండగా, అక్కడ కేవలం వెయ్యి ఇళ్ల నుంచి మాత్రమే స్వచ్ఛ ఆటో కార్మికులు చెత్తను సేకరిస్తున్నారని రుబీనా సభ దృష్టికి తెచ్చారు. పారిశుద్ద్యానికి సంబంధించి ప్రజలకు కనీస సౌకర్యాలు అందుబాటులోకి తేకుండా స్వీయ స్వచ్ఛరాంకులు ప్రకటించుకోవటం ఏమిటీ? అని ప్రశ్నించారు. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా స్వీపింగ్ యూనిట్లను, వాహనాలను, యంత్రాలను పెంచాలని సభ్యులు రుబీనా, సలీంబేగ్, మహమూద్ హుస్సేన్‌లు కోరారు. పాతబస్తీ తలాబ్‌కట్టాలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి, చెత్త కారణంగా పాతబస్తీలో ఆరుగురు చనిపోయారని, దోమల కారణంగా నలుగురు చిన్నారులు డెంగీ వ్యాధి బారిన పడ్డారని మజ్లీస్ కార్పొరేటర్లు అధికారులపై మండిపడ్డారు. దీనికి బాధ్యులెవరు? అని అధికారులను నిలదీశారు. అంతేగాక, చారిత్రక కట్టడం చార్మినార్ పరిసర ప్రాంతాలు, పక్కనే ఉన్న ఆసుపత్రి, అక్కడి నుంచి సమీపంలో ఉన్న హైకోర్టు పరిసర ప్రాంతాల్లో వారానికోసారి చెత్తను తరలిస్తున్నారని, ఈ విషయంపై స్థానిక మెడికల్ ఆఫీసర్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని పత్తర్‌గట్టి కార్పొరేటర్ సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఎవరు కుమ్మక్కయ్యారో చెప్పాలి
మజ్లీస్ సభ్యుడి ఆరోపణకు మేయర్ చురక
కార్వాన్ మజ్లీస్ సభ్యుడు రాజేందర్‌యాదవ్ మాట్లాడుతూ కార్వాన్ నియోజకవర్గంలో ఎక్కడబడితే అక్కడ చెత్తను కుప్పలుగా వేస్తూ డంపింగ్ యార్డుగా వాడుతున్నారని, ఇందులో కొందరు అధికారులు, రాజకీయ నాయకులు కలిసి చెత్త మాఫియాను నడుపుతున్నారని ఆరోపించారు. వెంటనే మేయర్ రామ్మోహన్ జోక్యం చేసుకుని ఎవరెవరు కుమ్మక్కై మాఫియాను నడుపుతున్నారో సభకు తెలియజేయాలంటూ మేయర్ ఆయన్ను గట్టిగా ప్రశ్నించటంతో సభ్యుడు రాజేందర్ యాదవ్ విషయాన్ని దాటవేశారు. ఆ తర్వాత రోడ్లు, రోడ్ల విస్తరణ అంశంపై కవితారెడ్డి, సలీంబేగ్, కృష్ణ అడిగిన ప్రశ్నలకు సిసిపి దేవేందర్‌రెడ్డి సమాధానం చెప్పారు. ఆ తర్వాత కౌన్సిల్ సమావేశాన్ని ముగిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.