హైదరాబాద్

రూ. 455 కోట్లతో రోడ్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: కొద్దిరోజుల క్రితం నగరంలోని హైటెక్స్ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ పుణ్యమాని కొన్ని రోడ్లకు మహార్దశ పట్టగా, ఇపుడు నగరంలోని అన్ని రోడ్లు చకచకా మెరవనున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ హాజరైన నేపథ్యంలో రోడ్లను రీ కార్పెట్ చేసిన బల్దియా అధికారులు ఇపుడు రోడ్లను మెరుగుపరిచేందుకు, అవసరమైన చోట కొత్త రోడ్లను వేసేందుకు వీలుగా రూ. 455 కోట్లను కేటాయించారు. ఈ పనులన్నీ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ అధికారులున్నారు. నిర్ణీత గడువులోపు నగరంలోని రోడ్ల నిర్మాణ పనులన్నీ పూర్తయితే మార్చి నెలాఖరు తర్వాత నగరంలోని వాహనదారులకు రోడ్లతో కాస్త ఉపశమనం లభించనుంది. ఇందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక ప్రణాళికను కూడా రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా రూ. 155.22 కోట్ల వ్యయంతో 158 బీటీ రోడ్ల నిర్మాణం, రూ. 63.93 కోట్ల వ్యయంతో 60 మార్గాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.235.60 కోట్ల వ్యయంతో వైట్ టాపింగ్ రోడ్లను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఇందుకు గాను ఇప్పటికే పలు ప్రధాన రహదారుల్లో బీటీ రోడ్ల నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. ట్రాఫిక్ అత్యధికంగా ఉండే ప్రధాన రహదారుల నిర్మాణం పూర్తయినత ర్వాత కాలనీరోడ్లు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఈ రోడ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతంగా అతి తక్కువ సమయంలో చేపట్టాలని భావిస్తున్నప్పటికీ నగరంలోని రోడ్లను రాత్రివేళల్లో అర్థరాత్రి పనె్నండు గంటల నుంచి తెల్లవారు ఐదు గంటల వరకు పనులను చేపట్టాలని కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకున్న తర్వాతే వారు పనులు చేపట్టేందుకు అనుమతులిస్తున్నారు. రోడ్లు, డ్రెయిన్ల నిర్వహణను శాస్ర్తియ పద్దతిన చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటికే పలు సార్లు ఐఐటీ, బిట్స్, జెఎన్‌టీయు, ఉస్మానియా, ఆస్కీలకు చెందిన ప్రొఫెసర్లు, విషయ నిపుణులలతో పలు దఫాలుగా చర్చలు నిర్వహించి, రోడ్ల నిర్మాణంలో శాస్ర్తియతపై కాంట్రాక్టర్లకు పలు సూచనలు, సలహాలను జారీ చేశారు.