హైదరాబాద్

ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌పై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ సురక్షిత చర్యలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వానికి, సిటీ పోలీసు కమిషనర్, అగ్నిమాపక శాఖ,ప్రసాద్ మల్టీఫ్లెక్స్ థియేటర్‌కు నోటీసులు జారీ చేసింది. నోటీసులను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. ఈ అంశంపై నగరానికి చెందిన విజయ్‌గోపాల్ అనే వ్యక్తిరాసిన లేఖను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై ప్రతివాదులు అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
17 నుంచి జాతీయ సహజ ఆహారోత్సవం
ఖైరతాబాద్, జనవరి 23: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాచురోపతి (పూణే) ఆధ్వర్యంలో వచ్చే నెల 17, 18 తేదీల్లో నగరంలోని పీపుల్స్‌ప్లాజాలో జాతీయ సహాజ ఆహారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయూష్ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎన్‌ఐఎన్ డైరెక్టర్ సత్యలక్ష్మితో కలిసి వివరాలను వెల్లడించారు. మనిషికి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని అందించేందే ఆహారమని, ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారంతో భయంకరమైన వ్యాధులబారిన పడుతున్నామని దీనిని దృష్టిలో ఉంచుకొని ఆహార అలవాట్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా సహజమైన ఆహారాన్ని ఎలా రూపొందించుకోవాలని, ఏ మేరకు ఆహారాన్ని తీసుకోవాలి, ఇంటి వద్దే మనకు అవసరమైన పంటలను ఎలా పండించుకోవాలి అనే అంశాలను వివరిస్తామని పేర్కొన్నారు.

భారీ గులాబీ
*లక్డీకాపూల్‌లో రూపుదిద్దుకుంటున్న గార్డెన్

హైదరాబాద్, జనవరి 23: నిత్యం లక్షలాది వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే లక్డీకాపూల్ మెయిన్‌రోడ్డులో ఉన్నట్టుండి ఓ భారీ గులాబీ దర్శనమిస్తోంది. దీన్ని తిలకించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారీ గులాబీ ఆకారాన్ని ఏర్పాటుచేస్తూ, గులాబీ గార్డెన్‌ను తీర్చిదిద్దే పనులు తుది దశలో ఉన్నాయి. ఈ గార్డెన్‌తో లక్డీకాపూల్ చౌరస్తా రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. లక్డీకాపూల్‌లో పాత సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌ను కూల్చివేయటంతో అక్కడ ఏర్పడిన ఖాళీ స్థలం చాలా కాలంగా ఖాళీగా పడి ఉంది. ఇందులో ఈ మధ్య రూ.5 భోజన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు లక్షల సంఖ్యలో వాహనాలు ప్రయాణించే ఈ రూట్‌లో కొద్ది రోజులక్రితం ప్రయాణించిన సీఎం కేసీఆర్ ఈ ప్రాంతం కళావిహీనంగా కన్పించటాన్ని గమనించి ఇక్కడ గులాబీ గార్డెన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డిని ఆదేశించటంతో ఆగమేఘాలపై పనులు ప్రారంభమయ్యాయి. చుట్టూ గులాబీ చెట్లను ఏర్పాటు చేయటంతో పాటు మధ్యలో భారీ గులాబీ పువ్వు ఆకారంలో ఫౌంటెన్‌ను నిర్మించి, అందమైన రంగులు వేస్తున్నారు. ఎన్నో నమూనాలను పరిశీలించిన తర్వాతే అధికారులు ఈ గులాబీ పువ్వు ఆకారంలో వున్న నమూనాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. దీనికి వెనకవైపు అందమైన చెట్ల వరుస, రంగురంగుల సీజనల్ పూలవనాలతో ఆకర్షణీయమైన ఉద్యానవనం వెలిసింది. దీంతో ఈ కూడలి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రస్తుతం పనులు తుది దశలో ఉన్నాయి. మరికొద్దిరోజుల్లో ఈ వనం ఏర్పాటు పనులు పూర్తయిన తర్వాత ఈ జంక్షన్ మరింత అందంగా కన్పించటంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని పనులను పర్యవేక్షిస్తున్న బయోడైవర్శిటీ విభాగం అదనపు కమిషనర్ కృష్ణ తెలిపారు. అంతేగాక, అనేక వ్యాపార సంస్థలు కల్గిన ఈ జంక్షన్‌లో ఈ ఉద్యానవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఓ సెల్ఫీ కేంద్రంగా కూడా మారే అవకాశముంది.