హైదరాబాద్

అరగంట దాటితేనే పార్కింగ్ వసూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: వాణిజ్య సముదాయాల్లో నిబంధనలకు లోబడి వాహనాల పార్కింగ్ అరగంట పాటు ఉచితంగా చేసుకోవచ్చు. ఈ మేరకు పురపాలక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంతో పాటు వివిధ పట్టణాల్లోని వాణిజ్య సముదాయాలకు ఇవి వర్తిస్తాయి. వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ దోపిడీపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ప్రసార మాధ్యమాలలో వెలువడుతున్న కథనాల నేపథ్యంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డవలప్‌మెంట్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. చాలా కాలంపాటు అధ్యయనం చేసిన అనంతరం జీఓఎంఎస్ నెంబర్ 63ని విడుదల చేసింది. అదే సమయంలో ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా కొన్ని నిబంధనలను సైతం విధించింది. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్‌కు వచ్చేవారు తాము కొనుగోలు చేసిన షాపింగ్ బిల్లు, టికెట్స్‌ను చూపించి ఉచిత పార్కింగ్‌ను వినియోగించుకోవచ్చు. నిర్దేశిత సమయం దాటిన తరువాత పార్కింగ్ వసూలు చేసుకునే వెసులుబాటును ఆయా షాపింగ్ మాల్స్ నిర్వాహకులకు కల్పించారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని వాణిజ్య సముదాయాల్లో తప్పనిసరిగా పార్కింగ్ సదుపాయాన్ని కల్పించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొంది.

కార్మికులను దోచుకునేందుకే కాంట్రాక్ట్ విధానం
* మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు
హైదరాబాద్, మార్చి 20: కార్మికుల ను దోచుకునేందుకే కాంట్రాక్ట్ విధానమ ని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు అన్నా రు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వ కాం ట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిర్వహించ తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకే రకమైన పనిచేస్తూ కూడా చాలీచాలని వేతనాలు పొందుతూ కాం ట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ కుటుంబాలను పోషించుకోలేని దుస్థితికి దిగజారుతున్నారని అన్నారు. అమెరికా వంటి అగ్రదేశాల్లో పర్మినెంట్ కార్మికుల కంటే కాంట్రాక్ట్ కార్మికులకే అధిక వేతనం ఉంటుందని అన్నారు. ఉద్యోగ భద్రతలేని కారణంగా కార్మికులకు అధి క చెల్లింపులు ఉంటాయన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2018లో అమలు చేయబోయే నూతన పీఆర్‌సీ నుంచే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సైతం వేతనాలు అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. సుందరయ్య పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం నేతలు వెంకటేష్, భాస్కర్, కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్మికులు అసెంబ్లీ మట్టడికి బయలుదేరగా వారిని పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ఆదర్శం
హైదరాబాద్, మార్చి 20: ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల స్కీం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేరళ కొట్టాయంకు చెందిన జర్నలిస్టుల బృందం ప్రశంసించింది. కొట్టాయంకు చెందిన 57 మంది జర్నలిస్టుల బృందం మంగళవారం నాచారం సమీపంలోని సింగం చెరువు తండాలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు వినూత్నమైన పథకాలపై అధ్యయనం నిమిత్తం మూడురోజుల పర్యటనకు ఈ బృందం నగరానికి విచ్చేసింది. కొట్టాయం సమాచార అధికారి శ్రీనిథామస్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు సానుజార్జ్, కార్యదర్శి సనీల్ నేతృత్వంలో ఈ బృందం నగరానికి వచ్చేసింది. చార్మినార్ చుట్టూ పాదచారుల క్షేత్రంగా అమలు చేసేందుకు చేపట్టిన చార్మినార్ పెడస్టేరియమ్ ప్రాజెక్టు పనులను కూడా ఈ బృందం పరిశీలించింది. పేదలపై పైసా భారం మోపకుండా, పూర్తిగా ప్రభుత్వం ఖర్చుతోనే 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంతటి చక్కని ఇళ్లను నిర్మించి ఇవ్వటంతో పాటు వౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్న ఈ స్కీం ఎంతో గొప్పదని బృం దం వ్యాఖ్యానించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 7.90 లక్షలను ప్రభు త్వం వెచ్చిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వారికి వివరించారు. సింగం చెరు వు తండాలో రూ. 13.64 కోట్ల వ్యయం తో 11 బ్లాకుల్లో జీప్లస్ 3 పద్ధతిలో మొత్తం 176 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ. 8542 కోట్ల వ్యయంతో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నట్లు, వీటిలో 92వేల 754 ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఆచార్య రాజేశ్వర శర్మకు పురస్కారం
కాచిగూడ, మార్చి 20: ప్రముఖ రచయిత డా.మద్దాళి సుబ్బారావు జయంతి సందర్భంగా ప్రముఖ సంసృతాంధ్ర పండితులు ఆచార్య అమరేశం రాజేశ్వర శర్మకు డా.మద్దాళి సుబ్బారావు స్మారక అవార్డు బహుకరణ సభ నృత్య కినె్నర, కినె్నర ఆర్ట్ థియేటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణాచారి పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. మద్దాళి సుబ్బారావు రచనలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక రచనలు ఎంతో పరిశోధనలు చేసి రచించారని తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త డా. వోలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో చారిత్రక నవలా చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివ ప్రసాద్, ఎ ఎస్ మూర్తి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డా.ఆర్ ప్రభాకర రావు, మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.

మీడియా ప్రతినిధులకు పురస్కారాల ప్రదానం
కాచిగూడ, మార్చి 20: ఉగాది పండుగను పురస్కరించుకుని శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్‌వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రింట్ అండ్ ఎలాక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఉగాది పురస్కారాలను ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర శాసన స్పీకర్ ఎస్.మధుసూదన చారి పాల్గొని నిజామ్ మునిమనువడు డా. రౌనఖ్ యార్ ఖాన్, సీనియర్ జర్నలిస్టు టీ. ఉడయవర్లకు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు మీడియా ప్రతినిధులకు పురస్కారాలను ప్రదానం చేశారు. నిరంతరం కాలంతో పాటు పోటీ పడుతూ వార్త విశేషాలను ప్రజలకు తెలియజేస్తున్నారని కీర్తించారు. పురస్కారాలను అందుకున్న జర్నలిస్టులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించారు. వైకే నాగేశ్వర రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో కళ పత్రికా ఎడిటర్ డా.మహ్మద్ రఫీ, డా.యాదగిరి రావు, ముత్యాల హరికిషన్, సీల్‌వెల్ కార్పొరేషన్ బండారు సుబ్బారావు, సంస్థ అధ్యక్షురాలు ఆమని పాల్గొన్నారు.