హైదరాబాద్

రూ.3 కోట్లతో హాస్టళ్ల మరమ్మతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాల్లో రూ.3 కోట్ల వ్యయంతో మరమ్మతులను చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ యోగితా రాణా వెల్లడించారు. వీటితో పాటు విద్యార్థులు, పుస్తక పఠన ప్రియుల సౌకర్యార్థం జిల్లాలోని 21 లైబ్రరీలో రూ.కోటి వ్యయంతో సౌకర్యాలను మెరుగుపర్చనున్నట్లు కూడా స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రాణా మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం, ఇప్పటికే ఉన్న భవనాలకు మరమ్మతులకు కూడా రూ.3కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. సీబీఎఫ్, ఇతర నిధులతో చేపట్టే ఈ పనులను గడిచిన 15 ఏళ్లలో ఎపుడూ చేపట్టలేదని వివరించారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. 62 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించేందుకు స్థలాలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 26 చోట్ల స్థలాలను గుర్తించామని వివరించారు. మిగిలిన మరో 36 భవనాలకు ఈ నెల 30వ తేదీలోపు స్థలాలను గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొత్త భవనాల నిర్మాణంతో పాటు పాత వాటికి పూర్తి స్థాయి వౌలిక వసతులను కల్పించటం వంటి పనులను కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు జాయ్‌ఫుల్ లర్నింగ్‌ను సూచించే విధంగా గోడలపై ప్లే వే చిత్రాలు, కథాచిత్రాలను పెయింటింగ్ చేయించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్ల మరమ్మతులకు సంబంధించి పనుల ప్రతిపాదనను అందజేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బాలికల వసతి గృహాలకు, సదుపాయాలు ఎక్కువగా ఉన్నట్లయితే, అక్కడి నుంచి సమీపంలో నడుస్తున్న అద్దె భవనాలలో నడుస్తున్న హాస్టళ్ల విద్యార్థులను అక్కడకు తరలించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు హన్మంత్‌నాయక్‌ను ఆదేశించారు. పటిష్టమైన భద్రత పోస్ట్ మెట్రిక్ విద్యార్థులను కూడా ప్రీ మెట్రిక్ వసతి గృహాలకు మార్చాలని సూచించారు. ప్రైవేటు భవనాల్లో సరైన వసతులు లేవని, ప్రభుత్వపరంగా పనులు చేపట్టేందుకు అవకాశం లేనందున, సమీపంలోని ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాలలో పూర్తి స్థాయిలో వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సర్వశిక్ష అభియాన్ ఈఈ భాస్కర్ వైద్యారోగ్యశాఖ వసతుల కల్పన విభాగం ఈఈ ఫణి హాజరయ్యారు.

రాష్ట్రంలో బీజేపీ ఒంటరి పోటీ
* 2019లో అధికారంలోకి రావడం ఖాయం: లక్ష్మణ్
వనస్థలిపురం, ఏప్రిల్ 18: రానున్న ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి తెలంగాణలో అధికారం చేపట్టడం ఖాయమని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గుంటి జంగయ్య నగర్ కాలనీలో స్థానిక నాయకులతో కలసి చీపుర్లతో రోడ్లను ఊడ్చారు. లక్ష్మణ్ మాట్లాడుతూ మాటల గారడీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. తెలంగాణ ప్రజానికానికి, నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తుచేశారు. కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాలుగేళ్ల అవినీతిరహిత పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. కర్నాటకలో బీజేపీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని చెప్పారు. కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా కార్యకర్తలు పని చేయాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే విద్యా రంగాన్ని పటిష్టం చేస్తామని, ప్రైవేట్ విద్యా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని అన్నారు. బూత్‌స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి వరకు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని మరింత పటిష్టంగా తయారు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపి అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి, ఎల్బీనగర్ బీజేపీ కన్వీనర్ వంగ మధుసూదన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, నాయకులు బోసుపల్లి ప్రతాప్, బాలశేఖర్ బాబు, ఆకుల రమేష్ గౌడ్, స్వామి గౌడ్, కృష్ణ, యశ్పాల్ గౌడ్, సందీప్ రెడ్డి, కిరణ్ పాల్గొన్నారు.