హైదరాబాద్

జీహెచ్‌ఎంసీలో మరో అవినీతి చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18: జీహెచ్‌ఎంసీలో మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కిం ది. సహోద్యోగి వద్దనే రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం అతని అవినీతికి పరాకాష్ఠగా మారింది. వివరాలలోకి వెళితే.. బాధితుడైన రణ్‌వీర్ భూపాల్ రెండేళ్ల క్రితం శేరిలింగంపల్లి సర్కిల్‌లో బిల్ కలెక్టర్‌గా పని చేశాడు. ఖానామెట్‌లోని ఓ గెస్ట్ హౌజ్‌లో ముజ్రా పార్టీ చేసుకుంటుండగా మాదాపూర్ పోలీసులు నిర్వహించిన దాడిలో పలువురు సీనియర్ అసిస్టెంట్‌లు, జూనియర్ అసిస్టెంట్‌లు, టాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్‌లు పట్టుబడ్డారు. దాంతో గ్రేటర్ కమిషనర్ సస్పెండ్ చేయగా ఇటీవలే మళ్లీ విధుల్లో చేరాడు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రణ్‌వీర్ భూపాల్ సస్పెన్షన్ కాలంలో తనకు రావలసిన వేతనం, ఇతర అలవెన్స్‌లు పొందడానికి లాస్ట్ పే సర్ట్ఫికెట్ ( ఎల్‌పీసీ )ను నిజామాబాద్‌కు పంపించేందుకు శేరిలింగంపల్లి సర్కిల్ 21లో సాధారణ పరిపాలనా విభాగం గుమస్తాగా పని చేస్తున్న పీ.లక్ష్మణ్ కుమార్‌ను కలిశాడు. అతను డబ్బులు డిమాండ్ చేయడంతో తానే ఇబ్బందుల్లో ఉన్నానని బతిమాలుకున్నా సదరు ఎస్టాబ్లిష్‌మెంట్ క్లర్క్ వినలేదు. దాంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. అందులో భాగంగానే బుధవారం రూ.20 వేలు లక్ష్మణ్ కుమార్‌కు ఇవ్వగా అప్పటికే చేరుకున్న ఏసీబీ అధికారులు పథకం ప్రకారం వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేష్‌లు లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని సీనియర్ అసిస్టెంట్ పీ.లక్ష్మణ్ కుమార్‌ను అరెస్టు చేసి నాంపల్లిలోని అవినీతి నిరోధక శాఖ కోర్టుకు తరలించారు. గతంలో సస్పెండైన టాక్స్ సెక్షన్‌కు చెందిన పలువురిని డబ్బుల కోసం వేధిస్తూ నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అదే కార్యాలయంలో జోనల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా అవినీతికి పాల్పడడం చూస్తుంటే జీహెచ్‌ఎంసీలో లంచావతారాలు ఎలా బరితెగించారో అర్థం అవుతోంది. ఇప్పటికైనా అవినీతికి పాల్పడుతున్న అధికారులు, సిబ్బందిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొడతాం
* ప్రశ్నించే గొంతులను నొక్కుతున్న టీఆర్‌ఎస్ * టీజేఏసీ కన్వీనర్, ప్రొఫెసర్ కోదండరాం
షాద్‌నగర్ రూరల్, ఏప్రిల్ 18: వాస్తవాలు మాట్లాడితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని టీజేఏసీ కన్వీనర్, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్తున్న కోదండరాం షాద్‌నగర్ బైపాస్ రహదారిపై స్థానిక తెలంగాణ జన సమితి పార్టీ స్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వాస్తవాలు మాట్లాడితే దాడులకు పాల్పడటం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా ఉండటంతోనే జనం వస్తారనే భయంతోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం సభలకు, సమావేశాలకు అనుమతులు సక్రమంగా ఇవ్వడం లేదని అన్నారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భవించిందని వివరించారు. భారత రాజ్యాంగంపై ప్రజాప్రతినిధులు చేసిన ప్రమాణాలను సైతం మరచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. టీజేఏసీ నాయకులు టీజీ శ్రీనివాస్, నరేందర్, సుమన్, శ్రీను నాయక్ పాల్గొన్నారు.