హైదరాబాద్

వికారాబాద్‌లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్: జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ జనం లేక నిర్మానుష్యమయ్యాయి. గురువారం 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం బయటకు వచ్చేందుకే భయపడ్డారు. ఉదయం తొమ్మిది గంటలకే భానుడు ప్రతాపం చూపడంతో వివాహాలకు హాజరు కావాల్సినవారు తప్పనిసరి పరిస్థితుల్లో ఎండ తగలకుండా జాగ్రత్తపడుతూ వెళ్లారు. ఓ పక్క ఎండ, మరో పక్క లెక్కలేనన్ని వివాహాలుండటంతో ఇటు బ్యాంకులు, అటు మార్కెట్, కార్యాలయాల్లో జనాలు చాలా తక్కువగా కనిపించారు. ఎండ తీవ్రత పెరగకముందే వివిధ పనుల మీద బయటకు వెళ్లినవారు నీడ పాటున పని ముగించుకుని, ఎండ తగ్గిన తర్వాత గమ్యానికి చేరుకునేందుకు ప్రయాణం మొదలు పెడుతున్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలితో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలి వేంద్రాల వద్ద చల్లటి నీటిని సేవిస్తున్నారు.

దేశానికే ఆదర్శం.. రాష్ట్ర పథకాలు
జీడిమెట్ల, ఏప్రిల్ 19: తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శ ప్రాయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్, ఎమ్మెల్సీ రాజు అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూమ్‌నగర్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను 13 మందికి ఎమ్మెల్సీ రాజుతో కలిసి వివేక్ అందజేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, సత్యనారాయణ, నాయకులు అంజన్ గౌడ్, జైహింద్, వేణు యాదవ్, సురేశ్ ముదిరాజ్ పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభం
సుభాష్‌నగర్ డివిజన్ రాంరెడ్డినగర్‌లో అనాథ ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కేపీ వివేక్, ఎమ్మెల్సీ రాజు ప్రారంభించారు. మండుతున్న ఎండల తాకిడికి చలివేంద్రాలు కొంతమేర ఉపశమనాన్ని కలిగిస్తాయని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్ రెడ్డి, రంగారావు, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.

సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన
జీడిమెట్ల డివిజన్ వెనె్నలగడ్డ, బౌద్ధనగర్‌లో సాయి సన్నిదానంలో షిరిడీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్, ఎమ్మెల్సీ రాజు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత కేఎం ప్రతాప్ విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. సాయినాథుని కృప ప్రతి ఒక్కరి ఉండాలని కోరుకున్నారు. ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సత్యనారాయణ, జగన్, నాయకులు మధుసూదన్, కృష్ణ, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించాలని వినతి రంగారెడ్డినగర్‌లో శిథిలావస్థకు చేరుకున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని నిర్మించాలని కోరుతూ పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే కేపీ వివేక్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వివేక్ స్పందిస్తూ విద్యాశాఖ అధికారులతో చర్చించి పాఠశాల నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుమార్ గౌడ్, రాజశేఖర్‌రెడ్డి, యాదవ రెడ్డి, సుధాకర్, రవి, వెంకటేశ్, యాదగిరి, సంపత్, రాజేశ్, ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.