హైదరాబాద్

మాజీ ప్రజాప్రతినిధుల సమస్యలను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: మాజీ ప్రజాప్రతినిధులు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో మాజీ ప్రజా ప్రతినిధుల రాష్ట్ర సమ్మేళనం మంగళవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోదండరామ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు సరైన నిధులు రాకపోవడంతో ప్రజాప్రతినిధులు సొంత డబ్బు పెట్టుకోవడంతో ఆర్థికంగా దెబ్బతిన్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే, ఎంపీలకు పెన్షన్ ఇస్తున్నారని. అదేవిధంగా ప్రజా ప్రతినిధులకు కూడా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై విస్తృత ప్రచారం చేసి వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడాకట్టి డిమాండ్ల సాధనకు కృషి చేయాలని అన్నారు. వివిధ వృత్తులలో ఉన్నవారికి వృద్ధాప్యంలో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని తెలిపారు. ప్రజాప్రతినిధులకు రూ.12వేల పెన్షన్‌తోపాటు హెల్త్ కార్డులను జారీ చేయాలని పేర్కొన్నారు. గ్రామ, నగర ప్రజాప్రతినిధి పిల్లలకు ప్రభుత్వ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్యనందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ నాయ్యమైన డిమాండ్ల సాధనకు తమవంతు సహాయ, సహకారాలను అందిస్తామని చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఆలోచనలతో అడుగు ముందుకువేస్తే ప్రతిఫలం ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ముందే తమ డిమాండ్లను సాధించుకోవాలని సూచించారు. తమ డిమాండ్ల సాధనకు సంతకాల సేకరణ చేసి ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందజేయాలని తెలిపారు. ప్రజాప్రతినిధుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వంపై పోరాటం చేసే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో యుద్దనౌక గద్దర్, జస్టిస్ చంద్రకుమార్, అసోసియోషన్ ప్రతినిధులు సారయ్య, భాస్కర చార్యులు, చంద్రశేఖర్, రాములు పాల్గొన్నారు.