హైదరాబాద్

అవినీతికి చోటివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి, మే 16: రైతుబంధు పథకం చెక్కులను, పాస్‌పుస్తకాలను నేరుగా లబ్ధిదారునికే అందించాలని, మధ్యవర్తులకు, ఇతరులకు ఇవ్వకూడదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు సూచించారు. మండలంలోని చుక్కాపూర్‌లో కొనసాగుతున్న చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ రఘునందన్ రావు, కందుకురు ఆర్డీవో రవీందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీంచారు. రిజిస్టర్‌లో సంతకం చేయించి, వేలిముద్రలు వేయించిన తర్వాత లబ్ధిదారుని ఫోన్ నెంబర్‌ను తీసుకోవడం లేదని గ్రహించి సంబంధిత అధికారులను మందలించారు. ఫోన్ నెంబర్‌ను తీసుకోవాలని సూచించారు. పాస్‌పుస్తకాలలో ఫొటోలు, ఆధార్ నెంబర్లు, చెక్కులపై పేర్లు తప్పుగా ముద్రించారని, కొంత మందికి చెక్కులు మాత్రమే ఇచ్చారని, పాస్‌పుస్తకాలు ఇవ్వలేదని కలెక్టర్ దృష్టికి చుక్కాపూర్ మాజీ ఎంపీటీసీ దాసరి యాదయ్య, సర్పంచ్ మాకం పాండయ్య తీసుకెళ్లారు. తప్పులు సరి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. వెల్జాల్‌లోని ఎస్‌బీఐలో డబ్బులు తీసుకోడానికి వెళ్లిన లబ్ధిదారుల పట్ల బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. గ్రామ రైతు సంఘం అధ్యక్షుడు వీరేశలింగం, రైతులు కల్లు రాజేశ్వర్ రెడ్డి, పాండు నాయక్,జే తిరుపతిరెడ్డి, కే నర్సింహ, మల్లారెడ్డి పాల్గొన్నారు.

దాహం దాహంపై ధర్నా
* భగ్గుమన్న మహిళలు
ఉప్పల్, మే 16: రామంతాపూర్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కాలనీల మహిళలు బుధవారం ఉప్పల్ జలమండలి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా రామంతాపూర్ నుంచి ఉప్పల్ వరకు ర్యాలీ చేపట్టారు. అధికారులకు వినతి పత్రం అందజేశారు. రామంతాపూర్‌లోని శ్రీరమణపురం, చర్చికాలనీ, గాంధీనగర్, రాజేంద్రనగర్, భరత్‌నగర్, శ్రీనగర్ కాలనీ, నేతాజీనగర్, ఇందిరానగర్‌లో నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారని సీపీఎం కమిటీ డివిజన్ కన్వీనర్ ఎర్రం శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సరఫరాలో లోఫ్రెషర్ ఉండటంతో సమస్య మరింత జఠిలమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ సమయంలోనే నీటి సరఫరా చేస్తుండటంతో వేసవి కాలం సమస్య మరింత తీవ్రమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో కాలనీ మహిళలు సుక్కమ్మ, లక్ష్మి, టి.సత్యమ్మ, అమృతమ్మ, మహేశ్వరమ్మ, సరస్వతి, జహంగీర్‌బీ, సలీమా, సావిత్రి, గణేష్, నవసింగ్ పాల్గొన్నారు.