హైదరాబాద్

రంజాన్‌కు విస్త్రృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నెలరోజుల పాటు దీక్షలు.. ఆ తర్వాత భక్తిశ్రద్ధలతో ప్రతీకగా జరుపుకునే రంజాన్‌కు విస్త్రృత ఏర్పాట్లు చేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. బుధవారం మేయర్ కమిషనర్ జనార్దన్ రెడ్డితో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రంజాన్ దీక్షలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ చేస్తున్న ఏర్పాట్లలో కార్పొరేటర్లు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ వర్గాల ప్రజలు జరుపుకునే బోనాలు, క్రిస్మస్, రంజాన్ వంటి పండుగలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు 2లక్షల గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అంతేగాక, దీక్షలు కొనసాగే ముప్పై రోజుల పాటు నగరంలోని ప్రతి మసీదు వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నట్లు తెలిపారు. రంజాన్ సందర్భంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, గుంతలను పూడ్చటం, వీధి దీపాల మరమ్మతులు, అవసరమైన చోట తాత్కాలిక ప్రాతిపదికన వీధి దీపాలు వంటివి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇలాంటి ఏర్పాట్లు చేయటంలో కార్పొరేటర్లు స్థానిక డిప్యూటీ కమిషనర్లతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఈ ఏటా పంపిణీ చేయాలనుకున్న రెండు లక్షల గిఫ్ట్ ప్యాక్‌లను ప్రతి మసీదు వద్ద ఓ పద్ధతి ప్రకారం పంపిణీ చేయాలని, ఈ రకంగా ఒక్కో డిప్యూటీ కమిషనర్‌కు ఐదు డివిజన్లు కేటాయించామని వివరించారు. ఈ ఏర్పాట్లను ఎప్పటికపుడు పర్యవేక్షించేందుకు వీలుగా అదనపు కమిషనర్(యూసీడీ)ని నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు.

రూ. 45 లక్షల విలువజేసే విత్తనాలు సీజ్
మేడ్చల్, మే 16: పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు మండలంలోని గుండ్లపోచంపల్లిలోని జువారి సీడ్స్, ధాన్య సీడ్స్ కంపెనీలపై హైదరాబాద్ రిజీయన్ తూనికలు కొలతశాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. నకిలీ విత్తనాలు రైతులకు సరఫరా చేయకుండా దాడులు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. కంపెనీల లైసెన్సు, తూకం మిషన్లు, ప్యాకింగ్ చేసే విధానం, నిబంధనలు పాటిస్తున్నారో లేదో వంటి విషయాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. తమ తనిఖీల్లో ప్యాకింగ్ తేదీలు, ప్యాకింగ్ నిబంధనలు, ప్యాకింగ్ లైసెన్సు వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయని నిబంధనలు పాటించకుండా ఉన్న రూ.42 లక్షల విలువ చేసే విత్తనాలను సీజ్ చేసినట్లు హైదరాబాద్ రిజీయన్ తూనికలు, కొలతలశాఖ డిప్యుటీ కంట్రోలర్ శ్రీనివాస్ తెలిపారు.