హైదరాబాద్

ఇంటింటి సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: ఇళ్లలో, బడిలో, బయట పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల నుంచి వారిని రక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జీ.వీ.కృష్ణయ్య అధ్యక్షతన శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించటంపై దృష్టి సారించాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. పిల్లల, మానసిక, శారీరక వికాస కేంద్రంగా హైదరాబాద్ జిల్లాను రూపొందించనున్నట్లు కలెక్టర్ యోగితారాణా ఇతర అధికారులు వెల్లడించారు.
పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అధ్యయనం చేసేందుకు నగరంలోని ఐదు వార్డుల్లోని వంద ఇళ్లలో ఇంటింటి సర్వే నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. పిల్లలు, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులతో మాట్లాడి ఆయా కుటుంబాలలో నెలకొన్న పరిస్థితులను విశే్లషించాలని సమావేశం అభిప్రాయపడింది. బడికి వెళ్తున్న పిల్లలు, ఇంట్లోనే ఉంటున్న పిల్లలు, తల్లిదండ్రులలో మద్యం సేవించే అలవాటు, చిన్న పనులకు పిల్లలను పంపించటం, పిల్లలను ఇంటి వద్దే వదిలి పెట్టి తల్లిదండ్రులిద్దరు ఉద్యోగాలకు, పనులకు వెళ్లటం, డబ్బులు, చాక్లెట్లు, స్వీట్లు ఇచ్చి పిల్లలను ప్రలోభపెట్టడం, గృహహింస, పిల్లలపై అసభ్యకరంగా వ్యవహారించటం వంటి తదితర అంశాలను ఈ అధ్యయనంలో గుర్తించనున్నట్లు తెలిపారు. పిల్లలపై ఏ రూపంలో అత్యాచారం జరిగినా, దాన్ని దాచి ఉంచటం వల్ల పిల్లల్లో ఆత్మన్యూనత నెలకొంటుందని సమావేశం అభిప్రాయపడింది.
ఈ సమావేశంలో ఇన్‌చార్జి జేసీ శ్రీవత్స కోటా, బాలల సంరక్షణ కమిటీ చైర్‌పర్సన్ శ్యామలదేవి, సభ్యురాలు కమల, జిల్లా సంక్షేమాధికారి సునంద, డీఎంహెచ్‌ఓ డా.పద్మజ, డీసీపీఓ ఇంతియాజ్, భరోసా షీటీమ్స్, ఎన్జీఓ సంస్‌థల ప్రతినిధులు పాల్గొన్నారు. అత్యాచారాలకు దారితీసే పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు వంద రోజుల ప్రచారోద్యమాన్ని నిర్వహించనున్నట్లు సెషన్స్ జడ్జి జీ.వీ.కృష్ణయ్య వెల్లడించారు. జిల్లాలోని 331 బాలల సంరక్షణ కమిటీలు, 914 అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు, 261 స్లమ్ లెవెల్ ఫెడరేషన్ల చైర్మన్లకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో స్వచ్చంద సంస్థలను కూడా భాగస్వాములను చేసి, సీఆర్పీలల వారీగా 48 క్లస్టర్లుగా విభజించనున్నట్లు తెలిపారు. పారా లీగల్ వాలెంటీర్లను, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పిల్లలపై జరిగే అత్యాచారాల నిరోధానికి సంబంధించి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రముఖ కూడళ్లు, బస్తీల్లో ఉన్న వంద గోడలపై అత్యాచారాల నిరోధక ప్రచార పెయింటింగ్‌లను వేయించనున్నట్లు తెలిపారు. సమాజంలో ఈ అంశంపై కదలిక తెచ్చేందుకు గోడ పత్రికలు, కరపత్రాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో బాలల రక్షణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. బాలల పరిరక్షణకు ఈ-బాక్సులను ఏర్పాటు చేసి, భరోసా కేంద్రానికి అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన బాలల సమాచారాన్ని రహస్యంగా ఉంచి, బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఆకట్టుకున్న ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యం
గచ్చిబౌలి, మే 19: సంజయ్ కుమార్ వాడపల్లి బృందం శిల్పారామంలో ప్రదర్శించిన ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యం ప్రదర్శన అలరించింది. నవజనార్ధన పారిజాతం, కలాపాన్ని సంజయ్ కుమార్ బృందం ప్రదర్శించిన పేరిణి నృత్యం కనువిందు చేసింది. శ్రీకృష్ణడిపై సత్యభామ తన ప్రేమని, కోపాన్ని ప్రదర్శించే అంశాలను కళాకారులు తమ అభినయంతో అపురూపంగా ప్రదర్శించి, ఆహూతుల్ని అబ్బురపరిచారు. ఈ ప్రదర్శనను గతంలో తొమ్మిదిరోజుల పాటు ప్రదర్శించేవారని, ప్రస్తుతం కాలానుగుణంగా ప్రదర్శన ఒక రోజుకు పరిమితమైంది. సత్యభామగా సంజయ్ కుమార్ ఆహార్యం అందర్నీ ఆలోచింపజేసింది. పేరిణి సంజయ్ కుమార్ 1989లో ప్రముఖ నాట్యాచారులు స్వర్గీయ నటరాజ రామకృష్ణ వద్ద పేరిణి నృత్యాని అభ్యసించారు. రెండున్న శతబ్దల క్రితం నృత్యజ్యోతి పేరిట అకాడమీని ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో వేల మంది నృత్య కళాకారులను తయారు చేశారు. తెలుగు రాష్టల్రలో ఇప్పటి వరకు 4వేల మందికిపైగా పేరిణి నృత్య కళాకారులను అందించారు. పేరిణి నృత్యం అభ్యసించిన తరువాత 1997 నుండి నాలుగు సంవత్సరాల పాటు ఆప్రికా ఖండంలోని 8దేశాల్లో పేరిణి నృత్య ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు అక్కడ పలువురికి శిక్షణ ఇవ్వడం జరిగింది. 2004 నుండి 2014 వరకు సింగపూర్, మలేషియా, ఇండోనేషియా,జపాన్ దేశాల్లో అక్కడ స్థిరపడిన తెలుగు వారితో పాటు ఆదేశ ప్రజలకు పేరిణి నృత్యపై శిక్షణ ఇచ్చి కళ వ్యాప్తికి కృషి చేశారు. ప్రస్తుతం నగరంలోని మీర్‌పేటలో నృత్యజ్యోతి నృత్యాలయాన్ని ఏర్పాటుచేసి పేరిణి నృత్యంపై శిక్షణ ఇస్తున్నారు. పేరిణి కుమార్ వారి శిష్యడు హెచ్‌ఎస్‌బీసీలో మేనేజర్‌గా పని చేస్తున్న సంజయ్, శ్రావంతి, రేఖలు ప్రదర్శించిన కాకతీయుల కాలం నాటి యుద్ద నృత్య అంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. అనంతరం ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న కుమారి సృష్టి బుద్దిరి ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది. కౌతం, వర్ణం, జావళి, థిల్లాన అంశాలపై నృత్యం చేసి నృత్య కళాప్రియులను కనువిందు చేశారు.అనంతరం శిల్పారామం అధికారులు కళాకారులను, గురువులను సాదరంగా సత్కరించారు.