హైదరాబాద్

ఎన్టీఆర్ చిరస్మరణీయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: సర్గీయ నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ప్రముఖ రంగస్థల నటుడు వైకే నాగేశ్వర రావుకు రంగస్థల పురస్కారంతో పాటు ‘కళా సంహ’ బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం జీపీ ఆర్ట్స్ కల్చరల్ అసోసియోషన్ ఆధ్వర్యంలో గురువారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోశయ్య పాల్గొని వైకే నాగేశ్వర రావుకు పురస్కారం ప్రదానం చేశారు. ఎన్‌టీఆర్ చిత్ర రంగంలోనే కాకుండా రాజకీయ రంగంల్లో రాణించారని కీర్తించారు. నటనలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని పేర్కొన్నారు. ఎన్‌టీఆర్ సినీ సంగీత విభావరి అందరిని అలరించాయి. ఎన్‌టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, ప్రముఖ సాహితీవేత్త డా.పాలకుర్తి మధుసూదన రావు, యలవర్తి రాజేంద్ర ప్రసాద్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, త్రినాథరావు, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస నాయుడు, పీ.నాగేంద్ర రావు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ‘్భకైలాస్’ చిత్ర ప్రదర్శన
కాచిగూడ, మే 24: సర్గీయ ఎన్‌టీఆర్ జయంతి సందర్భంగా ఎన్‌టీఆర్ నటించిన ‘్భకైలాస్’ చిత్ర పదర్శన రసంజలి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి జీవీ ఆర్ ఆరాధన సంస్థ చైర్మెన్ గుదిబండి వెంకట రెడ్డి, యలవర్తి రాజేంద్ర ప్రసాద్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంస్థ అధ్యక్షుడు వై.మల్లికార్జునమ్ పాల్గొని ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళు అర్పించారు. ఎన్‌టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. సభకు ముందు ప్రదర్శించిన చిత్ర ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరిస్తా
ఉప్పల్, మే 24: ఉప్పల్ కురుమనగర్‌లో చెత్త డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించడానికి శాయ శక్తులా కృషి చేస్తానని నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. కార్పొరేటర్ మేకల అనలా రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గురువారం కాలనీలో పర్యటించారు. ఇప్పటికే కాలనీ ప్రజలు మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఏరులై పారుతున్న మురుగునీరు దుర్వాసతో దుర్భర జీవనం గడుపుతుండగా మళ్లీ ఇక్కడికి చెత్త డంపింగ్ యార్డ్‌ను తరలించే యోచనను విరమించుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సమస్యను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళన చేపట్టాయి. టీఆర్‌ఎస్ నేతలు సైతం ఇక్కడ చెత్త డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేస్తే సహించమని హెచ్చరిస్తున్నారు. సంబధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించగలని మేయర్ హామీ ఇచ్చారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
రామంతాపూర్ డివిజన్‌లో అభివృద్ధి పనులను ఎంపీ మల్లారెడ్డితో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గంధం జ్యోత్స్న, డిప్యూటీ కమిషనర్ యాదగిరి రావు, ఇతర విభాగం అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు మున్సిపల్ కార్యాలయంలో రహదారి విస్తరణలో నష్టపోతున్న భవన యజమానులకు చెక్కులను పంపిణీ చేశారు.