హైదరాబాద్

ఒలింపిక్ డే రన్‌ను విజయవంతంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న ఒలింపిక్ డే రన్‌ను విజయవంతంగా నిర్వహించాలని, అందుకోసం విధ్యశాఖ అధికారులు, ఉపాధ్యాయుల బృందం పూర్తి సహకారం అందించాలని ఒలింపిక్ సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఆర్.ప్రేమ్‌రాజ్ తెలిపారు. లాల్‌బహదూర్ స్టేడియంలోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కార్యాలయంలో శనివారం విధ్యాశాఖ అధికారులు, పీణటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒలింపిక్ సంఘం తెలంగాణ (ఓఏటీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలో నిర్వహించే ఒలింపిక్ రన్ సందర్భంగా క్రీడా సంఘాలు, వివిధ శాఖల ఉన్నాతాధికారులు, రన్ నిర్వహణ కమిటీ కన్వీర్లతో వివిధ దశల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విధ్యాశాఖకు సంబంధించిన అధికారులు, వ్యాయమ ఉపాధ్యాయులతో ప్రేమ్‌రాజ్ సమీక్ష నిర్వహించిన పలు సూచనలు చేయడం జరిగింది. ఈనెల 23 నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఒలింపిక్ రన్‌ను నిర్వహిస్తారు.
నగరంలో నిర్వహించే రన్‌కు ముందుగా 27 జిల్లాలో రన్‌ను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఒలింపిక్ రన్‌లో జంటనగరాల్లోని అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో జిల్లా డిప్యూటీ ఎడ్యూకేషనల్ ఆఫీసర్స్, డిప్యూటీ స్కూల్ ఇన్స్‌పెక్టర్లు, వ్యాయమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రన్ నగరంలోని ఏడు కేంద్రాల నుండి ప్రారంభం కానున్నది.
కాబ్ ఎక్స్ మాస్టర్స్ గేమింగ్‌లో విజేత ఇన్విక్టస్ హైదరాబాద్
హైదరాబాద్, జూన్ 16: డోటా 2 అండ్ సీఎస్:గో సాయంతో హైదరాబాద్‌కు చెందిన వైపోతో ఇన్విక్టస్ జట్టు విజయం సాధించింది. నగరంలోని బేగంపేట్ ప్లేమ్యాక్స్ ఇంటరాక్టివ్‌లో ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది. ఇద్దరూ ఆటగాళ్లు గేమింగ్ ఔత్సాహికుల నుండి ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.
ఫైనల్లో ఇన్విక్టస్ హైదరాబాద్ విజయం సాధించి ట్రోఫీతో పాటు రూ.30వేల క్యాష్ ఫ్రైజ్‌ను సొంతం చేసుకుంది. అదే విధంగా రన్నర్స్‌గా నిలిచిన లాల్, టీం కాఫాన్ జట్టుకు రూ.20 క్యాష్‌ఫ్రైజ్‌తో పాటు రన్నర్స్ ట్రోఫీని అందజేశారు. హైదరాబాద్ ఈ టోర్నమెట్ మొదటి దశ విజయవంతంగా ముగియడంతో గేమింగ్ ఔత్సాహికుల మధ్య అంచనాలు, ఉత్సాహం రెట్టింపై, ఇది ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.