హైదరాబాద్

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని సమతానగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతోపాటు కేపీహెచ్‌బీకాలనీ సీఐ కుషాల్కర్ పాల్గొని 24 సీసీ కెమెరాలను ప్రారంభించారు. తమ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో దొంగతనాలు, చోరీలు నిందితులను సులభంగా పట్టుకోవచ్చని అన్నారు. ఒక సీసీ కెమెరా 1000 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కాలనీ అసోసియేషన్ సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చాన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎమ్మెల్యే తన సీడీపీ నిధుల నుంచి కోటి రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్ శివప్రసాద్, సెక్రట బాలు, సభ్యులు సురేష్, సుబ్బారెడ్డి, సుబ్బారాజు పాల్గొన్నారు.