హైదరాబాద్

స్థల సేకరణకు తగ్గిన అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు దృష్టిలో పెట్టుకుని సుదీర్ఘ పరిష్కారాన్ని సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ) ప్రాజెక్టుల స్థల సేకరణకు క్షేత్ర స్థాయిలో అడ్డంకులు తగ్గనున్నాయి. శివార్లలోని ఖాజాగూడ, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఎస్‌ఆర్‌డీపీ కింద నిర్మించనున్న ఫ్లైఓవర్లు, స్కైవేల స్థల సేకరణలో భాగంగా ఎక్కువగా గ్రామకంఠ భూముల్లో నిర్మించిన ఆస్తులున్నాయి. ప్రభుత్వ భూముల పరిధిలోకి వచ్చే ఈ గ్రామకంఠ భూముల నుంచి ఎలాంటి అడ్డంకులు, ఆంటకాల్లేకుండా స్థలాలను సేకరించేందుకు జీహెచ్‌ఎంసీ చేసిన ప్రయత్నం సత్ఫలితానిచ్చింది. ఈ భూముల్లో ప్రస్తుతం నివాసముంటున్న వారి నుంచి సేకరించి స్థలాలను బట్టి వారికి నష్టపరిహారాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించటంలో స్థలాలు కోల్పోనున్న బాధితులు, ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశం ఫలించింది. స్థల సేకరణకు బాధితులు కూడా అంగీకరించటంతో స్థల సేకరణకు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సగం ప్రధాన అడ్డంకులు తొలగినట్టయింది. రాష్ట్రంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తిదతర పథకాలకు వర్తింపజేస్తున్న మాదిరిగానే హైదరాబాద్ నగరంలోనూ గ్రామకంఠ భూములకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు కింద చేపట్టిన వివిధ రకాల నిర్మాణాల కోసం స్థలాలను కొల్పోయే గ్రామకంఠ స్థలంలోని బాధితులకు పట్టా భూముల తరహాలోనే నష్టపరహారం చెల్లించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు, ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు మేయర్ వివరించారు. ఉప్పల్, బాలానగర్, ఖాజాగూడ, మజీద్ బండ ప్రాంతాల్లో రోడ్డు విస్తరణకు సంబంధించి సేకరించిన స్థలాల యజమానులకు నష్టపరిహారం చెల్లించేందుకు సమస్యలు తలెత్తాయని, విషయంలో స్పష్టత కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మేయర్ తెలిపారు.
ఎక్కడెక్కడ ఎంత విస్తరణ
ఉప్పల్ ఫ్లై ఓవర్ కోసం ప్రతిపాదిత 200 అడుగుల మేర రోడ్డు విస్తరణను 150 అడుగులకే పరిమితం చేసే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు, ఇందుకు స్థారుూ సంఘంలో తీర్మానం చేసి, సర్కారుకు సమర్పించనున్నట్లు తెలిపారు. బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా 150 అడుగుల రోడ్డు విస్తరణ చేయనున్నట్లు, మజీద్ బండలో 120 అడుగుల, అంబర్‌పేట ఫ్లైఓవర్ నిర్మాణాని వల్ల ఆస్తులు కోల్పోయేవారికి ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టనున్నట్లు మేయర్ తెలిపారు.