హైదరాబాద్

ప్రత్యేక ఆకర్షణగా ఫ్లైఓవర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ నుంచి కొంతమేరకైనా ఉపశమనం పొందేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన నగరంలోని ఫ్లైఓవర్లు ఇపుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇటీవలే జీహెచ్‌ఎంసీ పాలక మండలి పెద్దలు, పలువురు అధికారులు దిల్లీ పర్యటనకు వెళ్లినపుడు అక్కడ అందంగా ముస్తాబు చేసిన ఫ్లైఓవర్లను గమనించారు. రాత్రిపూట అవి ఎంతో అందంగా కన్పిస్తుండటంతో చారిత్రక నేపథ్యం కల్గిన హైదరాబాద్ నగరంలోని ఫ్లైఓవర్లకు కూడా సుందరీకరణ పనులు చేపట్టాలని తీసుకున్న నిర్ణయం మేరకు ఈ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. సికిందరాబాద్, బషీర్‌బాగ్, బేగంపేట వంటి ప్రాంతాల్లో పరిసర ప్రాంతాలకు ఈ ఫ్లైఓవర్ల సుందరీకరణ అదనపు శోభను సంతరింపజేస్తోంది. గతంలో సీవోపీ-11 అంతర్జాతీయ సదస్సుకు నగరం వేదికైనపుడు కేవలం ఎంపిక చేసిన ఫ్లైఓవర్లకు మాత్రమే సుందరీకరణ పనులు చేపట్టిన బల్దియా ఇపుడు దశల వారీగా అన్ని ఫ్లైఓవర్లకు సుందరీకరణ పనులను చేపట్టింది. తొలి దశగా ఎంపిక చేసిన మాసాబ్‌ట్యాంక్, బషీర్‌బాగ్, పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, సచివాలయం ముందున్న తెలుగుతల్లి, సికిందరాబాద్ హరిహరకళాభవన్, సీటీఓ, బేగంపేట ఫ్లై ఓవర్లను ఎంపిక చేసుకుని పనులను చేపట్టారు. ప్రపస్తుతం వీటిల్లో కొన్ని ఫ్లైఓవర్ల పనులు పూర్తి కాగా, మరికొన్నింటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ సుందరీకరణ పనుల్లో భాగంగా ముందుగా ఫ్లైఓవర్‌ను పరిశుభ్రంగా ఉంచటంతో పాటు అందంగా కన్పించేలా రంగులు వేయటం, పచ్చదనాన్ని ఏర్పాటు చేయటం, అవసరమైన చోట ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసే వంటి పనుల్లో జీహెచ్‌ఎంసీ ఎలక్ట్రికల్, బయోడైవర్శిటీ, ఇంజనీరింగ్ విభాగాలను భాగస్వాములను చేశారు. సుమారు రూ.1.60 కోట్ల వ్యయంతో ఈ ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పూర్తయిన తెలుగుతల్లి ఫ్లైఓవర్, సికిందరాబాద్ హరిహరకళాభవన్ ఫ్లైఓవర్లు చీకటి పడిన తర్వాత రంగురంగుల విద్యుత్ దీపాలతో దగదగలాడుతూ వాహనదారులు, పాదచారులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆదిలోనే నిర్వహణ లోపం
ఫ్లైఓవర్లకు శాశ్వత ప్రాతిపదికన సుందరీకరణ పనులు చేపట్టాలన్న నిర్ణయానికి ఆదిలోనే నిర్వాహణపరమైన లోపాలు ఎదురవుతున్నాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్ సుందరీకరణ పనులు పూర్తయిన కొత్తలో అందమైన, రంగురంగుల లైట్లతో వెలిగిపోతూ నగరవాసులను ఎంతో ఆకట్టుకునేది. కానీ ప్రతిరోజు చీకటి పడిన తర్వాత వెలగాల్సిన లైట్లు ఒక్కో రోజు వెలగటం లేదు. కూతవేటు దూరంలోనే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఉన్నా, అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవటం గమనార్హం.