హైదరాబాద్

ఫుట్‌పాత్‌ల నిర్మాణంలో వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న ఫుట్‌పాత్‌ల నిర్మాణం, వాహనదారుల కోసం చేపట్టిన రోడ్ల మరమ్మతుల పనుల్లో వేగాన్ని పెంచాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ మెట్రోరైలు, హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్, జాతీయ రహదారులు, రోడ్లు, భవనాల శాఖలకు చెందిన చీఫ్ ఇంజనీర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే రోడ్ల పక్కన ఉండే నిర్మాణ వ్యర్థాలను తొలగించే పక్రియ ముమ్మరంగా సాగుతుందని వివరించారు. రోడ్లపై ఏర్పడే గుంతలను పూడ్చివేసే పనులు కొనసాగుతున్నా, కొత్తగా ఏర్పడే గుంతలను కూడా ఎప్పటికపుడు పూడ్చివేసి, రోడ్లతో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జన శోభయాత్ర లోపు నగరంలోని అన్ని రోడ్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు నిర్వహించాలని ఆదేశించారు. పలు రోడ్ల నిర్మాణం, హైదరాబాద్ మెట్రోరైలు కారిడార్లలో ఫుట్‌పాత్‌ల నిర్మాణాల పనులను మరింత వేగవంతం చేసి, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు అధికారులను కమిషనర్ ఆదేశించారు.