హైదరాబాద్

తాండూరు కాంగ్రెస్ టిక్కెట్ పైలెట్‌కే దక్కనుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, సెప్టెంబర్ 20: అనాధి కాలంగా కాంగ్రెస్‌కు కంచు కోటగా నిలిచిన తాండూరు నియోజక వర్గంలో గడచిన 1994 సాధారణ ఎన్నికలలో ప్రస్తుత ఆపధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అప్పటి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నాటి నుంచి తాండూరు కాంగ్రెస్ కంచుకోటకు బీటలు వారాయి. కాగా 2004 ఎన్నికలలో ఓక్కసారి మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే విజయం సాధించి మహేందర్ రెడ్డి హ్యట్రిక్‌లకు కళ్ళెం వేశారు. అప్పటి నుండి 2019, 2014 ఎన్నికలలో మళ్లీ మహేందర్ రెడ్డి టీడీపీ, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తాండూరు నియోజక వర్గంలో విజయ కేతనం ఎగుర వేస్తున్నారు. కాగా ప్రస్తుతం నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి మెజార్టీ ప్రజలు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. తాండూరు కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మహారాజ్‌ల కుటుంబం రాజకీయంగా ఘోరంగా విఫలం చెందటం, ప్రజల మన్ననలు కోల్పోవటంతో తాండూరు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. కాగా యంగ్ లీడర్స్ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్ మాజీ యువనేత పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి అరంగ్రేటం చేయటంతో నియోజక వర్గం పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానుల్లో నూతనోత్తేజం కనిపిస్తుంది. కాగా నియోజక వర్గంలో ప్రజాదరణ కోల్పోయిన మహారాజ్‌ల కుటుంబానికి, ప్రస్తుత నియోజక వర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జీ ఎం.రమేష్‌కు పార్టీ టిక్కెట్ కేటాయిస్తే ఆశించిన ఫలితం దక్కదని చాలా మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు విశ్వసిస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థి మహేందర్ రెడ్డి గెలుపు మరోసారి సునాయాసం అవుతుందన్న ఆందోళనలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సుస్పష్టం అవుతుండటం గమనార్హం. నూతనంగా పార్టీ తీర్థం పుచ్చుకున్న పైలెట్ రోహిత్ రెడ్డి ఇప్పటికే తాండూరు పట్టణ నియోజక వర్గం ప్రజల్లో ముఖ్యంగా యువతలో క్రేజ్ కల్గిన యువనేతగా మారాడు. ఆపధర్మ మంత్రి మహేందర్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోన గల్గిన సత్తా పైలెట్‌కే ఉందన్న వాదనలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో సైతం వినిపిస్తుండటం గమనించ దగ్గ అంశం. కాగా నియోజక వర్గంలో కాంగ్రెస్ శ్రేణలతో పాటు, అన్ని వర్గాల ప్రజలు, ఓటర్లు పైలెట్‌కే కాంగ్రెస్ టిక్కెట్ దక్కాలని ఆశిస్తున్నట్లు సమాచారం.

శిలాఫలకం కూల్చివేత
* దేవమ్మబస్తీలో కేసు నమోదు
జీడిమెట్ల, సెప్టెంబర్ 20: గాజులరామారం సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ దేవమ్మబస్తీలో గుర్తుతెలియని దుండగులు శిలాఫలకాన్ని కూల్చివేశారు. స్పందించిన బస్తీ సమాఖ్య అభివృద్ధి సేవా సమితి అధ్యక్షుడు తెరాల శ్రీనివాస్ గుప్త బస్తీ వాసులతో కలిసి జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ దేవమ్మబస్తీలోని అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు వేసిన సిమెంట్ రోడ్డును ప్రజాప్రతినిధులు ప్రారంభించిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.