హైదరాబాద్

ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: మహానగరంలో ముందస్తు ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే 11వేల అత్యాధనిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు(ఈవీఎం)లను నగరానికి తెప్పించిన జీహెచ్‌ఎంసీ వీటిపై త్వరలోనే ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణనిప్పించేందుకు సిద్దమవుతోంది. ఒకవైపు ఓటరు జాబితా సవరణ, స్వచ్ఛ కార్యక్రమాలతో పాటు రొటీన్ పౌరసేవల నిర్వహణను చేపడుతూనే మరోవైపు ఎన్నికల ఏర్పాట్లను కూడా ముమ్మరం చేశారు.
ఎన్నికలకు సంబంధించి వివిధ రకాల విధులు, ప్రక్రియలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా సాగేందుకు వీలుగా వివిధ ప్రక్రియలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక్కో నోడల్ అధికారిని నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కమిషనర్ దాన కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో జోనల్ కమిషనర్ రవికిరణ్‌కు మానవ వనరుల నిర్వహణ ప్రక్రియ బాధ్యతలను అప్పగించగా, జోనల్ కమిషనర్ హరిచందనకు ఈవీఎంలు, వీవీప్యాడ్‌ల నిర్వణ, స్వీప్ బాధ్యతలను అప్పగించారు. ఎన్నికలకు సంబంధించిన ట్రాన్స్‌పోర్టు విధులకు సి.రాంప్రకాశ్‌ను, ఎన్నికల సంబంధించి శిక్షణకు స్పోర్ట్స్ డైరెక్టర్ శశికిరణాచారిని, ఎన్నికల సామాగ్రి, పంపిణీ, ఇతర మేనేజ్‌మెంట్ కోసం అదనపు కమిషనర్ ఎ. విజయలక్ష్మిని నియమించారు. ఎన్నికల కోడ్ అమలు, ఎంసీఎంసీ బాధ్యతలను జిల్లా జాయింట్ కలెక్టర్ జే.రవి, సున్నిత ప్రాంతాల మ్యాపింగ్, జిల్లా సెక్యూరిటీ ప్రణాళికకు నోడల్ ఆఫీసర్‌గా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఎన్నికల వ్యయ నిర్వహణకు ఎగ్జామిషనర్ ఆఫ్ అకౌంట్స్ సీహెచ్ ద్రాక్షామణి, ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్‌కుమార్‌లను నియమించారు. ఎన్నికల పరిశీలకులకు నోడల్ అధికారిగా జాయింట్ కమిషనర్ పి.సరోజ, బ్యాలెట్ పత్రాలు, డమీ బ్యాలెట్‌ల నోడల్ అధికారిగా కే.రాంకిషోర్, మీడియా, కమ్యూనికేషన్ బాధ్యతలను సీపీఆర్‌ఓ వెంకటరమణను నియమించారు. వీరితో పాటు కంప్యూటరైజేషన్, హెల్ప్‌లైన్, లైవ్ వెబ్‌కాస్టింగ్, ఎస్‌ఎంఎస్ మానిటరింగ్‌లకు అదనపు కమిషనర్ ముషారఫ్ అలీ ఫరూఖీ, నివేదికలు, ప్రత్యుత్తరాలకు అదనపు కమిషన్ అద్వైతకుమార్‌సింగ్, జాయింట్ కమిషనర్ పి.సరోజ, పోలింగ్ కేంద్రాల వద్ద వౌలిక సదుపాయాల కల్పన, పోలింగ్ స్టేషన్ల తయారీ, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్‌కు చీఫ్ ఇంజనీర్ జియావుద్దిన్‌ను నియమించగా, పోలింగ్ సిబ్బంది ఆరోగ్యపరిరక్షణ బాధ్యతలను సీఎంఓ డా.ఎస్.ఎం.ఖాద్రి, పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్లుగా లేబర్ వెల్ఫేర్ ప్రాజెక్టు ఆఫీసర్ సి. ఇసాక్‌రాజ్, సెక్రటరీ రాం కిషోర్, ఎలక్షన్ టప్పాల్‌కు జాయింట్ కమిషనర్ మంగతాయారు, ఓటర్ల జాబితా ముద్రణ బాధ్యతలకు నోడల్ అధికారులుగా అసిస్టెంటు కమిషనర్ ఎస్.జయంత్, డీఈఈ కె.నర్సింగ్‌రావులను నియమిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

నిమజ్జనంపైనిఘా
* భారీగా సీసీ కెమెరాల ఏర్పాటు * సీపీ అంజనీ కుమార్ వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 20: గణేష్ శోభాయాత్ర నిమజ్జన ఊరేగింపునకు 10లక్షల నుంచి 15 లక్షల మంది ప్రజలు తరలివస్తారని పోలీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జంటనగరాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి టాంక్‌బండ్ వద్దకు గణేష్ శోభాయాత్ర విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనం చేయడానికి తీసుకువస్తున్న నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి 17500 మంది పోలీసులను బందోబస్తుకు నియమించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వివరించారు. బందోబస్తుతో పాటు ఊరేగింపులో పాల్గొనడానికి వస్తున్న ప్రజల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానకి జంట నగరాల్లో 2.50 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్ల తెలిపారు. బందోబస్తుకు అదనంగా 13 యూనిట్ల గ్రేహౌండ్స్ దళాలతో పాటు అత్యవసరాలకు రెండు యూనిట్ల ఆక్టోపస్ దళాలను రంగంలోకి దించుతామని చెప్పారు. ఈ ఏడాది గణేష్ విగ్రహాల నిమజ్జనం మరింత వేగంగా పూర్తి చేయడానకి ఆధునిక పరికరాలను, క్రేన్లకు అమర్చామని వివరించారు. ఒక్కో క్రేనుతో గంట వ్యవధిలో 25 విగ్రహాలను సులభంగా నిమజ్జనం చేయడానకి అవకాశం ఉందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వందతులను ప్రజలు నమ్మవద్దని, సమాచారం కోసం స్థానిక పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.