హైదరాబాద్

గణేష్ శోభాయాత్రకు 2100 మంది ట్రాఫిక్ పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: జంటనగరాల్లో ప్రతిష్టాత్మకంగా 23వ తేదీన నిర్వహిస్తున్న గణేష్ శోభాయాత్రలో పాల్గొనున్న అశేష జనానికి ట్రాఫిక్ నిబంధనల అంశాలను తెలియజేయటానికి నగర ట్రాఫిక్ పోలీసులు సమాయత్తం అవుతున్నారు. శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చే ప్రజలకు వివిధ మార్గాలను సూచించే బోర్డులను నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. జంట నగరాల అదనపుట్రాఫిక్ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ శుక్రవారం మీడియా ప్రతినిధులకు వివరించారు. 23న బాలనగర్, చంద్రాయణగుట్ట ప్రాంతల నుంచి గణేష్ శోభాయాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు. జంటనగరాల్లో 34 ప్రధాన కూడళ్లను గుర్తించామని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు గస్తీ ఉంటుందని చెప్పారు. ప్రధాన కూడళ్ల నుంచి గణేష్ శోభాయాత్రను చూడడానికి వచ్చే ప్రజలు సులువుగా ట్యాంక్‌బండ్ చేరుకోవడానకి వివిధ మార్గాలను ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేస్తారని చెప్పారు. ఆ రోజు జంటనగరాల్లో అనుమతించని రోడ్లపైకి ఆర్టీసీ బస్సులను, హెవీ లారీలు ఆయా మార్గల వైపునకు అనుమతి లేదని అన్నారు. ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు ట్రాఫిక్‌కు సంబంధించిన సమాచారం అందించామని పేర్కొన్నారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలకు ఎలాంటి వాహనాలను అనుమతించమని చెప్పారు. గణేష్ శోభాయాత్రకు వచ్చే వాహనాలకు పాస్‌లు ఇచ్చామని చెప్పారు. ఖైరతాబాద్ సమీపంలో 10 పార్కింగ్ ప్రాంతాలను ఎంపిక చేశామని తెలిపారు. 23వ తేదీ ఉదయం నుంచి 24వ తేదీ ఉదయం 8 గంటల వరకు ట్యాంక్‌బండ్ వైపునుకు వాహానాలను అనుమతించమని వివరించారు. గణేష్ శోభాయాత్రను పర్యవేక్షించడానికి 2100 మంది ట్రాఫిక్ పోలీసులను నియమించామని ప్రకటించారు. వదంతులను ఎవరూ నమ్మవద్దని స్థానిక పోలీసుల సహాకారం తీసుకోవాలని సూచించారు.